Cooking Tips: ఈ కూరగాయలను వండేటప్పుడు నీళ్లు కలపకూడదు.. ఎందుకంటే

Cooking Tips
x

Cooking Tips: ఈ కూరగాయలను వండేటప్పుడు నీళ్లు కలపకూడదు.. ఎందుకంటే

Highlights

Cooking Tips: కొన్ని కూరగాయలను వండేటప్పుడు నీళ్లు కలపకూడదు. ముఖ్యంగా ఆకుకూరలు, కొన్ని రకాల కూరగాయలను నీరు లేకుండా వండాలి. ఎందుకంటే వాటి రుచి, పోషక విలువలు అలాగే ఉంటాయి.

Cooking Tips: కొన్ని కూరగాయలను వండేటప్పుడు నీళ్లు కలపకూడదు. ముఖ్యంగా ఆకుకూరలు, కొన్ని రకాల కూరగాయలను నీరు లేకుండా వండాలి. ఎందుకంటే వాటి రుచి, పోషక విలువలు అలాగే ఉంటాయి. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీరు వండే కూరలు మరింత రుచిగా తయారవుతాయి. అయితే, ఇప్పుడు ఏ కూరగాయలకు వండేటప్పుడు నీళ్లు కలపకూడదో తెలుసుకుందాం..

బెండకాయ

బెండకాయ సహజంగా జిగటగా ఉంటుంది. దానికి నీళ్లు కలిపితే అది ఇంకా ఎక్కువ జిగటగా మారుతుంది. అందుకే దీనిని నూనె, సుగంధ ద్రవ్యాలతో మోస్తరు మంటపై వేయించి వండాలి. ఎందుకంటే, నీళ్లు వేయడం వల్ల దీని రుచి పూర్తిగా నాశనమవుతుంది.

వంకాయ

వంకాయ తేలికగా మెత్తబడే కూరగాయ. మీరు వంకాయ ఫ్రై వంటివి చేసేటప్పుడు నీటిని కలపడం మంచిది కాదు. వంకాయ వంటకి కొద్దిగా నూనె, మసాలాలు వేస్తే చాలు. నీరు మాత్రం అస్సలు కలపకండి.

క్యాబేజీ

క్యాబేజీ లోనే తేమ ఎక్కువగా ఉంటుంది. దీనిని తక్కువ నూనెలో వేయించి వండితే అదిరిపోయే రుచి వస్తుంది. నీటిని కలిపితే అది మృదువుగా మారి అసలు టేస్ట్ పోతుంది.

గుమ్మడికాయ

గుమ్మడికాయను కేవలం నూనె, మసాలాలతో వేయించుకుంటే చాలు. అదనంగా నీరు వేసినట్లయితే ఇది నీరుగా మారి రుచి తగ్గిపోతుంది.

కాప్సికమ్

కాప్సికమ్‌ను హై ఫ్లేమ్‌లో డ్రై రోస్ట్ చేస్తే మంచి వాసన టేస్ట్ వస్తుంది. అలా కాకుండా నీటిని కలిపితే చేదుగా మారుతుంది.

పొట్లకాయ

పొట్లకాయను కూరగా వేయించి వండితేనే బాగుంటుంది. ఎందుకంటే, దీంట్లో సహజ తేమ ఎక్కువగా ఉంటుంది. నీరు కలిపితే దాని స్పెషల్ టేస్ట్ పోతుంది.

కాకరకాయ

కాకరకాయను తక్కువ మంటపై నూనె, మసాలాలలో బాగా వేయించాలి. నీరు వేస్తే అది జిగటగా, చేదుగా మారుతుంది. కానీ డ్రైగా వండితే అది క్రిస్పీగా ఉండి చాలా రుచికరంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories