Beauty Tips:కాఫీ ఫేస్ ప్యాక్‌తో టానింగ్‌కి చెక్‌.. ఇలా ఉపయోగిస్తే మెరిసే ఛాయ మీ సొంతం..!

Check for Tanning With Coffee Face Pack If you use it Like This you Will Have a Shiny Complexion
x

Beauty Tips:కాఫీ ఫేస్ ప్యాక్‌తో టానింగ్‌కి చెక్‌.. ఇలా ఉపయోగిస్తే మెరిసే ఛాయ మీ సొంతం..!

Highlights

Beauty Tips: కాఫీలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

Beauty Tips: కాఫీలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే కాఫీ మాస్క్ డెడ్ స్కిన్ తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. దీంతోపాటు ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్‌ని పోగొడుతుంది. చాలా కాలం పాటు యవ్వనంగా, మెరిసే చర్మాన్ని పొందడానికి సహాయపడుతుంది. ఈ సహజసిద్దమైన ఫేస్‌ ఫ్యాక్‌ని ఎలా తయారుచేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

కాఫీ ఫేస్ ప్యాక్ తయారుచేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో కాఫీ పొడి, తేనె, పచ్చి పాలు కలపాలి. తరువాత ఈ మూడింటిని బాగా మిక్స్‌ చేయాలి. అంతే కాఫీ ఫేస్ ప్యాక్ తయారైనట్లే. కాఫీ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి. తర్వాత ముఖం, మెడపై బాగా అప్లై చేయాలి. కనీసం 10 నుంచి 15 నిమిషాలు అప్లై చేసి ఆరనివ్వాలి. ముఖాన్ని గుండ్రంగా నెమ్మదిగా మసాజ్ చేయాలి. తరువాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇది ముఖంపై పేరుకుపోయిన మురికిని పూర్తిగా శుభ్రపరుస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి కనీసం 2-3 సార్లు అప్లై చేయాలి. మంచి ఫలితాలని చూస్తారు. కాఫీ బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి స్కిన్ కూడా హెల్దీ గా ఉంటుంది. చర్మం ఎక్కడన్నా ఉబ్బినట్టుగా ఉన్నా దాన్ని తగ్గిస్తుంది. కావాలనుకుంటే కాఫీ క్యూబ్స్ తయారు చేసుకుని వాటిని అవసరమున్న చోట వాడుకోవచ్చు. కెఫీన్ టిష్యూ రిపేర్ కి సహకరిస్తుంది. అందువల్ల సెల్ గ్రోత్ బాగుంటుంది. స్కిన్ కూడా స్మూత్ గా తయారవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories