Chanakya Ethics: పొరపాటున కూడా ఇలాంటి స్త్రీలను నమ్మకండి.. జీవితం సర్వ నాశనం అవుతుంది

Chanakya Ethics
x

Chanakya Ethics: పొరపాటున కూడా ఇలాంటి స్త్రీలను నమ్మకండి.. జీవితం సర్వ నాశనం అవుతుంది

Highlights

Chanakya Ethics: ఆచార్య చాణక్యుడు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పండితులలో ఒకరు. చాణక్య నీతిలో రాసిన ఆయన విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.

Chanakya Ethics: ఆచార్య చాణక్యుడు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పండితులలో ఒకరు. చాణక్య నీతిలో రాసిన ఆయన విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. జీవితానికి సంబంధించిన అనేక విషయాలను, ఆయన అనుభవాలను తన పుస్తకంలో వివరించారు. తన విధానాలను అనుసరించే వారు జీవితంలో విజయం సాధిస్తారని చాలా మంది నమ్ముతారు. అలాగే, ఆచార్య చాణక్యుడు తన పుస్తకంలో స్త్రీల గురించి కూడా రాశారు. కొంతమంది స్త్రీలను ఎప్పటికీ నమ్మకూడదని ఆయన సూచించారు. అయితే, చాణక్యుడు చెప్పిన ఆ మహిళలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


ఇలాంటి స్త్రీలను నమ్మకండి

* ఆచార్య చాణక్యుడి ప్రకారం, చెడ్డ వ్యక్తిత్వం ఉన్న స్త్రీని నమ్మకూడదు. అలాంటి స్త్రీలు ఇతర పురుషుల వైపు ఆకర్షితులవుతారు. ఈ కారణంగా ఆమె తన భర్తను శత్రువుగా భావిస్తుంది. తనను ఎలాగైనా వదిలించుకోవాలని భావిస్తుంది.

* అందాన్ని చూసి ఎప్పుడూ మోసపోకండి. స్త్రీకి మంచి లక్షణాలు ఉండటం ముఖ్యం. మంచి గుణాలు ఉన్న స్త్రీలను మాత్రమే నమ్మండి.

* దురాశపరులైన స్త్రీలకు ఎప్పుడూ దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. అలాంటి స్త్రీలు చాలా ప్రమాదకరమని అంటున్నారు. అలాంటి వారు కుటుంబాన్ని నాశనం చేస్తారని ఇలాంటి వారికి దూరంగా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు.

* అహంకారం ఉన్న స్త్రీకి దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. సరస్వతి దేవి, లక్ష్మీ దేవి ఇద్దరూ అలాంటి స్త్రీల పట్ల అసంతృప్తిగా ఉంటారు. వారి ప్రవర్తన కారణంగా ఇంటి ఆనందం, శ్రేయస్సు కూడా నాశనమవుతాయి.

* చాణక్యుడి ప్రకారం, దేవుని భయభక్తులు లేని స్త్రీలను నమ్మకూడదు. అలాగే, గర్వం ఉన్న స్త్రీకి కూడా దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories