Cervical Cancer Symptoms: మహిళలు జాగ్రత్త.. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఇవే.. ఈ చిన్న మార్పులను అస్సలు వదలకండి!

Cervical Cancer Symptoms: మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ ప్రాణాంతక వ్యాధి ప్రధాన లక్షణాలు, కారణాలు, నివారణ మార్గాల గురించి డాక్టర్లు చెబుతున్న కీలక వాస్తవాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.

Ganesh
Published on: 8 March 2026 4:28 PM IST
Cervical Cancer Symptoms
X

Cervical Cancer Symptoms: మహిళలు జాగ్రత్త.. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఇవే.. ఈ చిన్న మార్పులను అస్సలు వదలకండి!

Cervical Cancer Symptoms: ఈ రోజుల్లో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గర్భాశయం యొక్క దిగువ భాగమైన సెర్విక్స్ (Cervix) వద్ద ఈ వ్యాధి అభివృద్ధి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని గురించి సరైన అవగాహన లేకపోవడం, ప్రారంభ దశలో లక్షణాలు బయటపడకపోవడం వల్ల చాలామంది మహిళలు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని అన్నారు. అసలు గర్భాశయ క్యాన్సర్ ప్రధాన లక్షణాలు అంటే ఏమిటి, వాటిని ఎలా నివారించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రధాన లక్షణాలు ఇవే..

మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా ఉండవు, కానీ వ్యాధి పెరిగే కొద్దీ ఈ క్రింది మార్పులు కనిపిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

* రెండు నెలసరిల మధ్య కాలంలో అకస్మాత్తుగా రక్తస్రావం అవ్వడం.

* సంభోగం తర్వాత రక్తస్రావం కావడం.

* కటి (Pelvic) ప్రాంతంలో విపరీతమైన నొప్పి.

* దుర్వాసనతో కూడిన అసాధారణ వైట్ డిశ్చార్జ్.

గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు..

ఆర్‌ఎంఎల్ హాస్పిటల్‌ గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సలోని చాధా ప్రకారం,

గర్భాశయ క్యాన్సర్‌ రావడానికి గల ముఖ్య కారణాలను పలువురు వైద్య నిపుణులు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) ఈ క్యాన్సర్‌కు అతిపెద్ద కారణం అని వెల్లడించారు. ఇది ప్రధానంగా లైంగిక సంబంధాల ద్వారా వ్యాపిస్తుందన్నారు. చిన్న వయస్సులోనే సెక్స్ ప్రారంభించడం, ఎక్కువ మంది భాగస్వాములను కలిగి ఉండటం, సురక్షితం కాని పద్ధతులు పాటించడం వల్ల ప్రమాదం పెరుగుతుందని వివరించారు. స్మోకింగ్ చేసే మహిళల్లో ఈ క్యాన్సర్ కణాలు త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం (Immunity) తగ్గడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పారు. దీర్ఘకాలంగా గర్భనిరోధక మాత్రలు వాడటం, ఎటువంటి ఆరోగ్య పరీక్షలు (Screening) చేయించుకోకపోవడం వల్ల ఈ వ్యాధి ముదిరిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

దీంతో ఎవరికి ప్రమాదం ఎక్కువ అంటే..

* దీర్ఘకాలంగా HPV ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారికి.

* చిన్న వయస్సులోనే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్న వారికి.

* వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న మహిళలకు.

* క్రమం తప్పకుండా మెడికల్ చెకప్స్ చేయించుకోని వారికి.

దీనిని ఎలా నివారించాలంటే..

ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ క్యాన్సర్‌ను సమర్థవంతంగా నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

* HPV వ్యాక్సిన్: గర్భాశయ క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో ఈ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

* పాప్ స్మియర్ పరీక్ష (Pap Smear): ప్రతి మహిళ నిర్ణీత కాలవ్యవధిలో పాప్ స్మియర్ లేదా సెర్వికల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. దీనివల్ల క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు.

* సురక్షిత అలవాట్లు: లైంగికంగా జాగ్రత్తలు పాటించడం, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం మేలు.

* ఆరోగ్యకరమైన జీవనశైలి: సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.

గర్భాశయ క్యాన్సర్ ప్రాణాంతకమే అయినప్పటికీ, సరైన సమయంలో అవగాహన పెంచుకోవడం, క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా దీనిని పూర్తిగా నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Ganesh

Ganesh

Next Story