ఆముదం నూనెతో చుండ్రుకి చెక్.. ఇలా చేస్తే అందమైన జుట్టు మీ సొంతం..!

Castor Oil Removes Dandruff Makes Hair Beautiful
x

ఆముదం నూనెతో చుండ్రుకి చెక్.. ఇలా చేస్తే అందమైన జుట్టు మీ సొంతం..!

Highlights

Hair Care Tips: చలికాలంలో చుండ్రు సమస్య విపరీతంగా పెరుగుతుంది.

Hair Care Tips: చలికాలంలో చుండ్రు సమస్య విపరీతంగా పెరుగుతుంది. ఈ రోజుల్లో జుట్టు పొడిబారడం వల్ల డ్రైగా మారుతుంది. అయితే ఆవనూనెను ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. ఆముదంలో ఉండే పోషకాలు జుట్టు మూలాలకు పోషణనిచ్చి, చుండ్రును పోగొట్టి, జుట్టు దృఢంగా అందంగా మారుస్తాయి. ఆముదంను జుట్టుకు చాలా రకాలుగా అప్లై చేయవచ్చు. ఆ పద్దతుల గురించి తెలుసుకుందాం.

వేప ఆకులతో

ఆముదం, వేప ఆకులను కలిపి రాసుకుంటే చుండ్రు తొలగిపోతుంది. వేపలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఆముదంలో ఉండే గుణాలు చర్మాన్ని తేమగా మారుస్తాయి. ఆవనూనెతో వేప ఆకుల పేస్ట్‌ను అప్లై చేయడం వల్ల చుండ్రు తొలగిపోయి జుట్టుకు మెరుపు వస్తుంది.

కలబందతో

కలబంద, ఆముదం కలిపి రాసుకుంటే చుండ్రు పోతుంది. అలోవెరా జెల్‌లో 2 టీస్పూన్ల ఆముదం మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత బాగా కడగాలి. ఈ పద్ధతిని నిరంతరం ఉపయోగిస్తే చుండ్రు కొన్ని రోజుల్లో పోతుంది.

హెన్నాతో

హెన్నాతో ఆముదం మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల చుండ్రు పోవడమే కాకుండా జుట్టు నల్లగా మారుతుంది. హెన్నాలో ఒక చెంచా ఆముదం మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. 1 గంట తర్వాత కడిగేస్తే జుట్టు అందంగా కనిపిస్తుంది.

కొబ్బరి నూనెతో

కొబ్బరిలో ఆముదం కలిపి రాసుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఈ రెండు నూనెలు జుట్టుకు మేలు చేస్తాయి. ఈ నూనెల మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే చుండ్రు పోతుంది. దీంతో పాటు జుట్టు రాలడం ఆగిపోతుంది. జుట్టులో కొత్త మెరుపు వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories