Cancer: 2008–2017 మధ్య పుట్టిన వారికి ఈ క్యాన్సర్‌‌తో ప్రమాదం

Cancer: 2008-2017 మధ్య జన్మించిన వారిలో 1.5 కోట్లమందికి జీవితంలో ఒక దశలో జీర్ణవ్యవస్త క్యాన్సన్ వచ్చే ప్రమాదం ఉందని తాజాగా ఒక అధ్యయనం వెల్లడించింది.

Indira Ram
Published on: 11 July 2025 6:15 AM IST
Cancer
X

Cancer: 2008–2017 మధ్య పుట్టిన వారికి ఈ క్యాన్సర్‌‌తో ప్రమాదం

Cancer: 2008-2017 మధ్య జన్మించిన వారిలో 1.5 కోట్లమందికి జీవితంలో ఒక దశలో జీర్ణవ్యవస్త క్యాన్సన్ వచ్చే ప్రమాదం ఉందని తాజాగా ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ కేసుల్లో ఎక్కువగా చైనా, భారత్‌లోనే నమోదవుతాయని కూడా ఆ అధ్యయనం తెలిపింది. వివరాలు చూద్దాం.

2008 నుండి 2017 మధ్య లో పుట్టిన వారిక జీర్ణవ్యవస్థ క్యాన్సర్ ప్రమాదకరంగా మారింది. ఈ మధ్య కాలంలో పుట్టిన వారిలో దాదాపు కోటిన్నర మందికి జీవితంలో ఒక్కసారైనా ఈ క్యాన్సర్ రావొచ్చునని తాజాగా ఒక అధ్యయనం వెల్లడించిది. అయితే విచిత్రం ఏంటంటే.. ఇందులో దాదాపు ఎక్కువ కేసులు చైనా, భారత్‌లోనే నమోదవుతాయని అధ్యయనం వెల్లడించడంతో అందరూ ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు.

జీర్ణవ్యవస్థ కేసులు మొదట చైనా, ఆ తర్వాత భారత్‌లో ఎక్కువగా ఉంటే ఇక మూడో స్థానం అమెరికా, ఆ తర్వాత ఆఫ్రికాలో ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన క్యాన్సర్ ఏజెన్సీ అయిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ పరిశోధకులు ఈ వివరాలను వెల్లడించారు.

కొన్ని అధ్యయనాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరాల మధ్యలో పుట్టిన వారిలో 15.6 మిలిమన్ల జీవిత కాలంలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నమోదవొచ్చు అని పరిశోధకులు భావిస్తున్నారు. వీటిలో 76 శాతం హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ద్వారా సంభవిస్తాయని వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా సాధారణంగా కడుపులో కనిపిస్తుంది. అయితే దీనివల్ల ఇన్ఫెక్షన్ కలిగి అది క్యాన్సర్‌‌కి కారణం అవుతుంది. అయితే దీన్ని బ్యాక్టీరియల్ చికిత్స ద్వారా గుర్తించవచ్చు.

అంతేకాదు ప్రజలకు గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌‌పై అవగాహన తీసుకొస్తే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కోసం స్కీ్రనింగ్ మరియు చికిత్స తీసుకోవాలి. అప్పుడు ఆ వ్యాధిని అంచనా వేయడానికి వీలుంటుంది. ఇలా చేస్తే 75 శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని అధ్యయనం చెబుతోంది.

Indira Ram

Indira Ram

Next Story