Banana: చలికాలం రాత్రిపూట అరటిపండు తినొచ్చా.. తింటే ఏం జరుగుతుంది..?

Can You Eat a Banana at Night in Winter What Happens if You eat it
x

Banana: చలికాలం రాత్రిపూట అరటిపండు తినొచ్చా.. తింటే ఏం జరుగుతుంది..?

Highlights

Banana: చలికాలం రాత్రిపూట అరటిపండు తినొచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది.

Banana: చలికాలం రాత్రిపూట అరటిపండు తినొచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే అరటిపండు చల్లటి ప్రభావం చూపుతుందని కొందరు నమ్ముతారు. మరికొంతమంది అరటిపండ్లు మధ్యాహ్నం పూట మాత్రమే తినాలని చెబుతారు. వాస్తవానికి అరటి ఒక ఆరోగ్యకరమైన పండు. దీనిలో కాల్షియం, ఐరన్‌తో సహా అనేక పోషకాలు ఉంటాయి. ఈ పండును నిర్లక్ష్యం చేయడం ఆరోగ్య పరంగా మంచిది కాదు. చలి సమయంలో రాత్రిపూట అరటిపండు తినాలా వద్దా అనేది తెలుసుకుందాం.

రాత్రిపూట అరటిపండు తినాలా వద్దా?

రాత్రిపూట అరటిపండు తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎవరికైనా దగ్గు, జలుబు ఉంటే మాత్రం తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. నిద్రపోయే ముందు అరటిపండు తింటే శ్లేష్మం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అంతే కాదు అరటిపండ్లు జీర్ణం కావడానికి సమయం పడుతుంది కాబట్టి మలబద్ధకం సమస్య రావచ్చు. ఈ కారణంగా పగటిపూట తినడం మంచిది.

చలిలో పిల్లలకు అరటిపండ్లు ఇవ్వాలా వద్దా?

పిల్లలకి చలిలో అరటిపండ్లు ఇవ్వాలా వద్దా అని తల్లిదండ్రులు సందేహం వ్యక్తం చేస్తారు. అరటిపండులో దాదాపు 100 కేలరీలు ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. అందుకే ప్రతి సీజన్‌లో పిల్లలకు అరటిపండ్లు తినేలా చూడాలి. అయితే ఎండాకాలమైనా, చలికాలమైనా పిల్లలకు కఫం ఉంటే రాత్రిపూట తినకూడదు.

ఇలాంటి వారు అరటిపండు తినకూడదు

దంతాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అరటి పళ్ళు తినకూడదు. మైగ్రేన్‌తో బాధపడుతున్న రోగులు అరటిపండుకి దూరంగా ఉండాలి. అంతే కాకుండా షుగర్ వ్యాధి ఉన్నవారు అరటిపండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీనివల్ల నిద్రలేమి, తలనొప్పి సమస్యలు ఏర్పడుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories