Calcium Deficiency : చిన్న పిల్లల్లో కాల్సియం లోపం.. ఎముకలు బలహీనంగా మారకుండా ఉండాలంటే ఏం తినాలి ?

Calcium Deficiency : చిన్న పిల్లల్లో కాల్సియం లోపం.. ఎముకలు బలహీనంగా మారకుండా ఉండాలంటే ఏం తినాలి ?
x

Calcium Deficiency : చిన్న పిల్లల్లో కాల్సియం లోపం.. ఎముకలు బలహీనంగా మారకుండా ఉండాలంటే ఏం తినాలి ?

Highlights

పిల్లలు అనారోగ్యం పాలైతే, వాళ్లకు ఏం బాధ ఉందో సరిగ్గా చెప్పలేరు. అలాంటి సమయాల్లో పెద్దలు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేని సమస్యలు వస్తే, భవిష్యత్తులో వాళ్లకు ఆరోగ్య సమస్యలు రావొచ్చు.

Calcium Deficiency : పిల్లలు అనారోగ్యం పాలైతే, వాళ్లకు ఏం బాధ ఉందో సరిగ్గా చెప్పలేరు. అలాంటి సమయాల్లో పెద్దలు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేని సమస్యలు వస్తే, భవిష్యత్తులో వాళ్లకు ఆరోగ్య సమస్యలు రావొచ్చు. పిల్లల్లో అలాంటి ఒక సమస్యే కాల్షియం లోపం. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. అసలు పిల్లల్లో కాల్షియం లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? వాటిని ఎలా తగ్గించాలో తెలుసుకుందాం.

కొంతమంది పిల్లల్లో కాల్షియం లోపం సాధారణంగానే ఉంటుంది. ముఖ్యంగా 5 ఏళ్ల లోపు పిల్లల్లో కూడా ఈ సమస్య కనిపించవచ్చని చెప్పారు. పిల్లలు ఈ లోపాన్ని గుర్తించలేరు, తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు అంచనా వేయలేకపోవచ్చు. అయితే, దీనికి కొన్ని లక్షణాలు ఉంటాయని, వాటిని తల్లిదండ్రులు గుర్తించి, ఆ లోపాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు.

5 ఏళ్ల లోపు పిల్లల్లో కాల్షియం లోపం ఉంటే కొన్ని లక్షణాలు బయటపడతాయి. వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. కాల్షియం లోపం ఉన్న పిల్లలు మాటిమాటికి చిరాకు పడుతూ ఉంటారు. సరిగ్గా నిద్రపోరు, సాధారణంగా పిల్లలు నడవడం నేర్చుకునే వయసు కంటే ఆలస్యంగా నడవడం మొదలుపెడతారు. పళ్ళు రావాల్సిన సమయం కంటే ఆలస్యం వస్తాయి. కండరాలు పట్టేసినట్టు, నొప్పులు వస్తుంటాయి. మ ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను కలిసి వైద్య పరీక్షలు చేయించాలి. పరీక్షల ద్వారా పిల్లల్లో కాల్షియం లోపం ఉందో లేదో తెలుస్తుంది. ఇంకేమైనా లోపాలు ఉంటే అవి కూడా బయటపడతాయి.

మీ పిల్లల్లో పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లడంతో పాటు, కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటించడం మొదలుపెట్టాలి. మీ పిల్లల ఆహారంలో ఈ కాల్షియం ఉన్న పదార్థాలను చేర్చాలి. పాలు, పెరుగు, పనీర్ ఇవి కాల్షియానికి మంచి వనరులు. పిల్లలకు ప్రతిరోజూ ఇవి ఉండేలా చూసుకోవాలి. పాలకూర, మెంతి కూరల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని పిల్లల ఆహారంలో చేర్చాలి. కొన్ని రకాల ధాన్యాలు, జ్యూస్‌లు కొన్ని బ్రెడ్‌లు, సీరియల్స్, జ్యూస్‌లలో కూడా అదనంగా కాల్షియం కలిపి అమ్ముతారు. వాటిని కూడా ఇవ్వొచ్చు. ఈ ఆహార పదార్థాలను పిల్లల డైట్‌లో చేర్చడం ద్వారా కాల్షియం లోపాన్ని తగ్గించవచ్చు. ఒకవేళ ఇవన్నీ చేసినా పిల్లల్లో మార్పు కనిపించకపోతే, వెంటనే డాక్టర్‌ను మళ్ళీ సంప్రదించాలి, హాస్పిటల్‌లో చూపించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories