Health: నోటి ద్వారా శ్వాస తీసుకుంటున్నారా.. చాలా హానికరం..!

Breathing Through The Mouth Very Harmful
x

Health: నోటి ద్వారా శ్వాస తీసుకుంటున్నారా.. చాలా హానికరం..!

Highlights

Health: శ్వాస అనేది జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే శ్వాస ఉన్నంత కాలం మనిషి జీవితం సురక్షితంగా ఉంటుంది.

Health: శ్వాస అనేది జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే శ్వాస ఉన్నంత కాలం మనిషి జీవితం సురక్షితంగా ఉంటుంది. శ్వాస ఆగిపోయిన వెంటనే జీవితం ముగుస్తుంది. ఈ పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకుంటారు కానీ మీరు ఎలా ఊపిరి తీసుకుంటున్నారనేది ఎప్పుడైనా ఆలోచించారా.. వాస్తవానికి ఊపిరితిత్తులను చేరుకోవడానికి 2 వాయుమార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి నోరు, మరొకటి ముక్కు. చాలా మంది ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటారు కానీ నోటి ద్వారా శ్వాస తీసుకునేవారు చాలా మంది ఉన్నారు. రాత్రి నిద్రిస్తున్నప్పుడు లేదా జలుబు చేసినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం చాలా సార్లు జరుగుతుంది. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల మీకు చాలా సమస్యలు ఎదురవుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.

నోటి ద్వారా ఊపిరి పీల్చుకుంటే ఏం జరుగుతుంది..?

1. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల గాలి ఫిల్టర్ కాదు. అలాగే ఎక్కువగా పీల్చడం వల్ల రక్తంలో ఆక్సిజన్, కార్బన్-డయాక్సైడ్ స్థాయి మరింత దిగజారుతుంది. రక్తం pH స్థాయి క్షీణిస్తుంది. దీని కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి.

2. నోటికి రక్షణ వ్యవస్థ లేదు. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల జలుబు, శ్వాసకోశ సమస్యలు త్వరగా నయమవుతాయి. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం ద్వారా నాడీ వ్యవస్థ చక్కగా ఉంటుంది.

3. మీరు మీ నోటి ద్వారా శ్వాస తీసుకుంటే వ్యాయామాలు చేసిన తర్వాత కూడా ఎటువంటి ఫలితం ఉండదు. మరోవైపు మీరు మీ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటే వ్యాయామం చేసిన తర్వాత బరువు తగ్గుతారు.

4. వాస్తవానికి మీరు నిద్రపోతున్నప్పుడు శరీరం రికవరీ మోడ్‌కు వెళుతుంది. అందుకే ఆ సమయంలో ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం అవసరం. తద్వారా మీ సిస్టమ్ సులభంగా విశ్రాంతిలోకి వెళ్లిపోతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories