Lip Care Tips: పెదవులు నల్లగా మారాయా.. ఈ చిట్కా ఉపయోగించి ఎర్రగా మార్చుకోండి..!

Lip Care Tips: పెదవులు నల్లగా మారాయా.. ఈ చిట్కా ఉపయోగించి ఎర్రగా మార్చుకోండి..!

Jyothi
Updated on: 21 Feb 2023 7:00 AM IST
Blackened Lips Turn them Red Using this Tip
X

Lip Care Tips: పెదవులు నల్లగా మారాయా.. ఈ చిట్కా ఉపయోగించి ఎర్రగా మార్చుకోండి..!

Lip Care Tips: చర్మానికి సంబంధించి అనేక సమస్యలను తొలగించడంలో శెనగపిండి అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీనిని ప్రాచీన కాలం నుంచి వాడుతున్నారు. శనగ పిండి పెదవులపై ఉన్న టానింగ్‌ను కూడా సులభంగా తొలగిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది నల్లటి పెదవులతో ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు ఈ చిట్కా ఉపయోగించి పెదాలని ఎర్రగా మార్చుకోవచ్చు. దీనిని ఎలా చేయాలో తెలుసుకుందాం.

ఈ రెమిడి చేయడానికి రెండు చెంచాల శెనగపిండి, కొన్ని పాలు, చిటికెడు పసుపు కావాలి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో శెనగపిండి, పాలు, పసుపు వేసి బాగా కలపాలి. ఒక మందపాటి పేస్టులా తయారుచేయాలి. దీనిని పెదవులపై అప్లై చేయాలి. కొద్దిసేపు చేతి వేళ్లతో సులువుగా మర్దన చేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే పెదవులపై ఉండే టాన్‌ తొలగిపోయి పెదవులు ఎర్రగా మారుతాయి.

అలాగే రెగ్యులర్‌గా లిప్ స్టిక్‌ని వాడేటప్పుడు బయటికి వెళ్లి వచ్చిన వెంటనే దానిని రిమూవ్ చేయాలి. దీని కోసం మీరు ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్‌ని మీరు వాడొచ్చు. ఇలా వీరితో తొలగించడం వల్ల పెదవులు నల్లబడకుండా ఉంటాయి. చాలా మందికి పెదాల్ని తడిపే అలవాటు ఉంటుంది. ఆస్తమాను పెదవులు తడపడం వల్ల పెదవులు నల్లగా మారుతాయి. ఈ అలవాటు ఉంటే మానుకోవడం మంచిది.

Jyothi

Jyothi

Next Story