రోజూ గుప్పెడు వాల్ నట్స్ తింటే ప్రయోజనాలివే..

రోజూ గుప్పెడు వాల్ నట్స్ తింటే ప్రయోజనాలివే..
x
Highlights

రోజూ గుప్పెడు వాల్ నట్స్ తింటే ప్రయోజనాలివే.. రోజూ గుప్పెడు వాల్ నట్స్ తింటే ప్రయోజనాలివే..

వాల్ నట్స్.. చూడటానికి రాళ్లల ఉంటాయి. కానీ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో ఇది టాప్ వన్ గా ఉంటుంది అంటున్నారు ఆరోగ్యనిపుణులు. రోజూ గుప్పెడు మోతాదులో వాల్ నట్స్ తింటే అనేక రకాల ఆరోగ్య సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రోజు గుప్పెడు వాల్‌ నట్స్‌ తింటూ ఉంటే.. డిప్రెషన్‌ దరికి చేరదంటున్నారు నిపుణులు. అలాగే ఏకాగ్రతని పెంచటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి అంటున్నారు ఆరోగ్యనిపుణులు.

రోజు వాల్ నట్స్ తినడం వల్ల శరీరానికి కావల్సిన కీల‌క‌ పోషకాలు అందుతాయి. అలాగే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల నియంత్రణకు వాల్ న‌ట్స్‌ బాగా ప‌నిచేస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఇవి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. డిప్రెషన్, అల్జీమర్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రాన్స్ డిసీజ్ వంటి వాటిని తగ్గించడంలో వాల్ న‌ట్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తాయి అంటున్నారు నిపుణులు.

జీడిపప్పు, బాదం, పిస్తా, పీనట్స్, వంటి నట్స్ తినేవారితో పోలిస్తే.. వాల్ నట్స్ తినే వారిలో డిప్రెషన్‌ స్థాయులు 26% తగ్గినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. వాల్ నట్స్ తినడం వల్ల డిప్రెషన్‌ తగ్గిపోవడపై కాకుండా ఏకాగ్రత కూడా సమకూరుతున్నట్టు అధ్యయనం వెల్లడైంది. కాబట్టి డిప్రెషన్‌ను దూరం చేయడానికి మందులకు బదులుగా ఆహార మార్పుల్లో భాగంగా వాల్‌నట్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories