భోజనం తర్వాత నీరు తీసుకుంటే బరువును తగ్గించవచ్చట..!

భోజనం తర్వాత నీరు  తీసుకుంటే  బరువును తగ్గించవచ్చట..!
x
Highlights

ప్రతి రోజు సరైన మోతాదులో నీరు తాగడం వల్ల మన శరీరానికి ఎంతటి మేలు కలుగుతుందో అందరికి తెలిసిందే. అయితే నీరు తాగడంలో అప్పుడప్పుడు సమయపాలన పాటించాల్సిన...

ప్రతి రోజు సరైన మోతాదులో నీరు తాగడం వల్ల మన శరీరానికి ఎంతటి మేలు కలుగుతుందో అందరికి తెలిసిందే. అయితే నీరు తాగడంలో అప్పుడప్పుడు సమయపాలన పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా భోజనానికి ముందు నీరు తాగడం వలన భోజన సమయంలో తక్కువగా తినాలనిపిస్తుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉండదు.ఈ కారణంగా బరువు పెరిగే అవకాశం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కావున భోజనాంతరం తరువాత నీరు ఎక్కువగా తీసుకుంటే అధిక బరువును తగ్గించుకోవచ్చు. రోజుకు కనీసం 4 లీటర్ల కంటే ఎక్కువగా నీరు తాగుతుండాలి. నీరు తాగడం వలన శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళుతాయి.

చాలామంది రోజుకు నీరు తాగాలని తాగుతుంటారు. మరికొందరైతే అసలు నీళ్లే తాగారు. ఇంకా చెప్పాలంటే.. చాలామంది భోజనం చేసిన అరగంటకో లేదా గంట తరువాతో నీరు తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల తిన్న ఆహరం జీర్ణం అవకుండా.. కడుపు ఉబ్బరం, అజీర్తి, కళ్లు తిరగడం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి,

కావున తిన్న తర్వాత నీరు తాగడం అలవాబు చేసుకోవడం మంచిది. ఆకలి వేస్తున్నప్పుడు హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం కంటే ఇంట్లో తయారుచేసిన పదార్థాలు తీసుకుంటే క్యాలరీలు కరిగించుకోవడానికి సాధ్యపడుతుంది. త్వరగా బరువు తగ్గించుకోవాలంటే వాటర్ డిటాక్స్ చాలా అవసరం. బరువు తగ్గడమే కాదు ఆరోగ్యంగా ఉండాలంటే కూడా వాటర్‌ను ఎక్కువగా తీసుకోవాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories