కొత్తిమీర వల్ల ఇన్ని ప్రయోజనాలా..!

కొత్తిమీర వల్ల ఇన్ని ప్రయోజనాలా..!
x
Highlights

కొత్తిమీర.. రుచికోసం ఆహార తయారీలలో ఎక్కువుగా ఉపయోగిస్తుంటారు. కానీ కొత్తిమీర వలన రుచితో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం అంటున్నారు...

కొత్తిమీర.. రుచికోసం ఆహార తయారీలలో ఎక్కువుగా ఉపయోగిస్తుంటారు. కానీ కొత్తిమీర వలన రుచితో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొత్తిమీరలో రుచికరమైన, ఆరోగ్యానికి ఉపయగపడే అధ్బుతమైన హెర్బల్స్ చాలా ఉన్నాయి. కొత్తిమీరను వైద్యసంబంధమైన ఔషదాల తయారీలలో ఉపయోగిస్తున్నారు.

కొత్తిమీర చాలా యాంటీ-ఆక్సిడేంట్స్'ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. చర్మాన్ని కాపాడటానికి వాడే రసాయనికి మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాపాడుటకు వాడే మిశ్రమాలలో కొత్తిమీర నుండి తీసిన ద్రావాలను కలిపితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

కొత్తిమీర మంచి భావాన్ని కలిగించటమే కాకుండా, మంచి అనుభవాన్ని కలుగజేస్తుంది. దీనిలో 'ఎసేన్షియాల్ ఆయిల్స్' ఉండటము వలన తలనొప్పి, మానసిక అలసటను మరియు టెన్సన్స్'ను తగ్గించుటలో ఉపయోగపడును. విటమిన్స్, మినరల్స్ విషయంలో కొత్తమీర వీటిని అధికంగా కలిగి ఉంది. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ 'K' కొత్తిమీరలో పుష్కలంగా ఉన్నాయి. మరియు జింక్, కాపర్, పొటాసియం వంటి మినరల్స్'ని కలిగి ఉంది.

కొత్తిమీర ఆహారాన్ని రుచి గానే కాకుండా, జీర్ణక్రియ రేటుని కూడా పెంచును. అంతే కాకుండా జీర్ణక్రియ వ్యాధులను, అజీర్ణం, వాంతులు, వంటి వాటిని తగ్గించును కొత్తిమీర ఎక్కువగా యాంటీ-ఆక్సిడెంట్స్'లను కలిగి ఉండటము వలన కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా ఆపుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories