Benefits of Banana Peels: అరటి తొక్కతో అందం, ఆరోగ్యం

Benefits of Banana Peels, Beauty Care with Banana Peels | Banana Peels for Pigmentation
x

Benefits of Banana Peels:(File Image) 

Highlights

Benefits of Banana Peels: అరటి తొక్కే కదా అనుకోకండి..దాంతో అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు

Benefits of Banana Peels: ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరాల్లో అరటి పండు ఒకటి. అరటి పండులో అనేక పోషకాలు మరియు కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో వుండే విటమిన్లు B-6, B-12, మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. సాధారణంగా అరటి పండు తిని దాని తొక్కను పడేస్తూ వుంటాము. అరటి తొక్కే కదా అని అనుకుంటున్నారా? అవును అరటి తొక్కలో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా. అరటి తొక్కతో అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అదెలానో మన 'లైఫ్ స్టైల్' లో తెలుసుకుందాం.

అరటి పండు తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ కి ఎంతో మేలు చేస్తాయి. తొక్క లోపలి వైపు భాగంతో మీ ఫేస్ ని రుద్దండి, ఒక అరగంట ఆగాక శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా రెగ్యులర్ గా చేశారంటే మీ ముఖం మీద ఉన్న ముడతలు తగ్గిపోతాయి.

అరటి తొక్క పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది మరియు క్రొత్తవి రాకుండా చేస్తుంది. దీనికోసం, పులిపిర్లు ఉన్న ప్రాంతాన్ని అరటితొక్కతో రుద్దండి లేదా ఆ ప్రాంతం మీద రాత్రంతా అరటితొక్కను కట్టండి. చర్మం కొరకు అరటితొక్కతో చేసే చికిత్సలలో ఇది సులభమైన మార్గం.

పళ్ళు కొద్దిగా లేత పసుపు రంగులోకి మారుతున్నాయని అనుమానం వచ్చిందా మీకు? అందుకోండి, అరటి పండు తొక్క. తొక్క తినాలా ఏమిటి అని భయపడకండి, అదేం అక్కరలేదు. కేవలం, తొక్క లోపలి భాగంతో మీ పళ్ళని రుద్దండి, అంతే. ప్రతి రోజూ ఇలా చేశారంటే రెండు వారాల తరువాత తేడా మీకే తెలుస్తుంది.

మొటిమలు తగ్గటానికి అరటితొక్కతో మీ ముఖాన్ని మరియు శరీరాన్ని ఐదు నిముషాలపాటు మర్దన చేయండి. మీకు వారంలోపల మంచి ఫలితం కనపడుతుంది. ఇలా మొటిమలు మాయమయ్యేవరకు చేయండి.

సోరియాసిస్ తో ఉన్న ప్రాంతం అంతటా అరటితొక్కతో రాయండి. అరటి తొక్క మాయిశ్చరైజేషన్ గుణాలను కలిగి ఉన్నది మరియు దురదను కూడా తగ్గిస్తుంది. ఇది త్వరగా సోరియాసిస్ ను నయం చేస్తుంది మరియు మీరు తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు చూడవొచ్చు. దురద మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందేందుకు దోమలకాటు ఉన్న చర్మము మీద అరటితొక్క తో మసాజ్ చేయండి ఫలితం వుంటుంది.

ఇప్పటి నుండి అరటిపండు తిన్న తరువాత అరటి తొక్కని పడేయకుండా పైన చెప్పిన విధంగా వాడండి చాలా మంచి ఫలితాలని పొందుతారు. అరటి తొక్కలు మొక్కలకు మంచి ఫర్టిలైజర్స్ గా పనిచేస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories