Diabetes: నోటి దుర్వాసన మధుమేహానికి సంకేతమా..!

Bad Breath is a Sign of Diabetes | Health Tips
x

Diabetes: నోటి దుర్వాసన మధుమేహానికి సంకేతమా..!

Highlights

Diabetes: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మధుమేహ రోగులు ఉన్నారు. వారి సంఖ్య భారతదేశంలో మరీ ఎక్కువగా ఉంది...

Diabetes: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మధుమేహ రోగులు ఉన్నారు. వారి సంఖ్య భారతదేశంలో మరీ ఎక్కువగా ఉంది. ఈ వ్యాధికి ఇప్పటివరకు సరైన మందు కొనుగొనలేదు. కానీ నియంత్రించడానికి వివిధ రకాల మందులు ఉన్నాయి. మధుమేహం నిజానికి జీవనశైలికి సంబంధించిన సమస్య. మీ తప్పుడు ఆహారపు అలవాట్లు మధుమేహానికి దారితీస్తాయి. చాలా మందికి దీని గురించి తెలియక సమస్యని పెద్దదిగా చేసుకుంటారు.

మీ రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే మీరు నోట్లో కొన్ని లక్షణాలని గమనించండి. మధుమేహం అనేది శరీరంలోని అన్ని భాగాలను ప్రభావితం చేస్తుంది. ఇది చాలా వరకు నోటి ద్వారా కూడా గుర్తించవచ్చు. వ్యాయామం, మంచి ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉన్నా హఠాత్తుగా బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగితే దంత, మూత్ర పరీక్షలు తప్పక చేయాల్సిందే. నోటి దుర్వాసన కారణంగా నోటి పరీక్ష చేయవలసి ఉంటుంది. దీనిని మనం హాలిటోసిస్ అని పిలుస్తాము. షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే నోటి నుంచి దుర్వాసన వస్తుంది.

డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అంటే మధుమేహం అత్యవసర పరిస్థితి. ఇందులో కీటోన్ కారకం ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులలో సాధారణంగా వచ్చే దుర్వాసన అని వైద్యులు నిర్ధారించారు. 250/300 కంటే ఎక్కువ చక్కెర స్థాయిలు ఉన్న రోగులలోడయాబెటిక్ కీటోయాసిడోసిస్ ఏర్పడుతుంది. నోటి నుంచి దుర్వాసన వస్తోంది. కీటోన్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి రోగి మూత్ర పరీక్ష చేయించుకోవాలి. డయాబెటిక్ కీటోయాసిడోసిస్, హాలిటోసిస్ డయాబెటిక్ రోగులలో ఆందోళనకరమైన పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories