Ayurvedic: ఈ ఆయుర్వేద పద్దతుల ద్వారా చెడు కొలస్ట్రాల్‌ నివారించండి.. సులువుగా బరువు తగ్గుతారు..!

Avoid Bad Cholesterol With These Ayurvedic Methods You will Lose Weight Easily
x

Ayurvedic: ఈ ఆయుర్వేద పద్దతుల ద్వారా చెడు కొలస్ట్రాల్‌ నివారించండి.. సులువుగా బరువు తగ్గుతారు..!

Highlights

Ayurvedic: ఈరోజుల్లో స్థూలకాయం అనేది చాలామందిని వేధిస్తున్న అతి పెద్ద సమస్య.

Ayurvedic: ఈరోజుల్లో స్థూలకాయం అనేది చాలామందిని వేధిస్తున్న అతి పెద్ద సమస్య. దీనివల్ల అనేక ఇతర వ్యాధులు సంభవిస్తున్నాయి. దీనికి కారణం చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు. అయితే వేసవికాలం కంటే చాలామంది శీతాకాలంలో బరువు తొందరగా పెరుగుతారు. దీనికి కారణం చలి కారణంగా చాలామంది బద్దకంగా తయారవుతారు. శారీరకంగా చురుకుగా ఉండరు. శరీరంలో పెరుగుతున్న చెడు కొలెస్ట్రాల్‌ను సకాలంలో నియంత్రించకపోతే అది అధిక రక్తపోటు, గుండెపోటు సమస్యలకి కారణం అవుతుంది. అందుకే ఆయుర్వేద పద్దతుల్లో సహజసిద్దంగా చెడు కొలస్ట్రాల్‌ని తొలగించుకోండి. ఆ పద్దతుల గురించి ఈరోజు తెలుసుకుందాం.

వేడి నీరు, తేనె

ప్రతిరోజు పరగడుపున ఒక కప్పు వేడి నీటిలో ఒక చెంచా తేనె వేసి కలపాలి. ఈ డ్రింక్ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఇందులో మీరు కొన్ని చుక్కల వెనిగర్ లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.

వెల్లుల్లి

రోజూ ఖాళీ కడుపుతో 2 వెల్లుల్లి తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి కంట్రోల్‌లో ఉంటుంది. ఇది బరువును వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది.

పసుపు పాలు లేదా నీరు

మీరు పసుపు కలిపిన పాలు లేదా నీటిని తీసుకుంటే అది ధమనులలో పేరుకుపోయిన మురికిని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

మెంతి గింజలు

మెంతి గింజల్లో పొటాషియం, ఐరన్, జింక్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజుకు రెండుసార్లు మెంతి గింజల డ్రింక్‌ తీసుకుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిపోతుంది. అంతేకాదు రోజు మొత్తం చురుకుగా ఉంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories