Joint Pains: వర్షాకాలం కీళ్ల నొప్పులతో జాగ్రత్త..!

Joint Pains
x

Joint Pains: వర్షాకాలం కీళ్ల నొప్పులతో జాగ్రత్త..!

Highlights

Joint Pains: వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వృద్ధులు, ఆర్థరైటిస్ బాధితులు ఎదుర్కొనే ప్రధాన సమస్య కీళ్ల నొప్పులు.

Joint Pains: వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వృద్ధులు, ఆర్థరైటిస్ బాధితులు ఎదుర్కొనే ప్రధాన సమస్య కీళ్ల నొప్పులు. వాతావరణ మార్పులు, తేమ పెరగడం, ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల శరీరంలో మార్పులు జరిగి కీళ్లకు సంబంధించిన నొప్పులు, వాపులు ఎక్కువవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వాతావరణ మార్పుల ప్రభావం:

వర్షాకాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. దీనికి తోడు వాతావరణ పీడనంలో వచ్చే మార్పులు కీళ్ల కదలికపై ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావంతో కండరాలు గట్టిపడి, కీళ్లలో వాపు, నొప్పి పెరుగుతుంది. కొందరికి తిమ్మిర్లు, అలసట కూడా ఎక్కువగా కనిపిస్తాయి.

వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

విటమిన్ డి లోపాన్ని తగ్గించండి

ఈ కాలంలో ఎండ తక్కువగా కనిపించడంతో శరీరానికి అవసరమైన విటమిన్–డి అందకపోతుంది. ఇది ఎముకల బలానికి కీలకం. కావున అవసరమైతే డాక్టర్ సూచన మేరకు సప్లిమెంట్స్ తీసుకోవాలి.


నీటిని పుష్కలంగా తాగండి

వర్షాకాలంలో దాహం తక్కువగా అనిపించడంతో చాలామంది నీటిని తక్కువగా తాగుతారు. ఇది కీళ్ల మధ్య ఫ్లుయిడ్‌ బలహీనతకు దారితీస్తుంది. కనీసం రోజుకు మూడు లీటర్ల నీరు తాగేలా చూసుకోవాలి.

ఆహారంలో పోషకాల సమతుల్యత

విటమిన్ B12, విటమిన్ E: ఇవి కీళ్ల నొప్పిని తగ్గించి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

♦ క్యాల్షియం, మెగ్నీషియం: ఎముకలకు బలం ఇస్తాయి.

♦ హెల్దీ ఫ్యాట్స్ & ప్రొటీన్లు: నట్స్, ఆకుకూరలు, గుడ్లు, చేపలు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.

♦ హై క్యాలరీ ఫుడ్ తగ్గించాలి.

వ్యాయామం తప్పనిసరి

కీళ్ల కదలిక మెరుగుపరచడానికి రోజువారీ వ్యాయామం అవసరం. నొప్పులు ఎక్కువగా ఉన్నవారు డాక్టర్ సూచించిన తేలికపాటి వ్యాయామాలు చేస్తే మంచిది.

ఆయిల్ మసాజ్ & వేడి కాంప్రెస్

ప్రతిరోజూ నెమ్మదిగా ఆయిల్ మసాజ్ చేయడం, అవసరమైతే వేడి నీటి ప్యాక్ పెట్టడం వలన నొప్పి తక్కువవుతుంది. ఇది నరాలకు విశ్రాంతిని ఇస్తుంది.

ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి?

♦ ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ ఉన్నవారు

♦ అధిక బరువు ఉన్నవారు

♦ వృద్ధులు

♦ ఇంతకుముందు కీళ్లకు శస్త్రచికిత్స చేసినవారు


వర్షాకాలం ఎప్పుడూ చల్లగా, తేమగా ఉంటుంది. అయితే, శరీర ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నొప్పులు, బలహీనతలు వెంటాడతాయి. సరైన ఆహారం, తగిన వ్యాయామం, హైడ్రేషన్, ఫిజియోథెరపీ వంటి చర్యలతో మీరు కీళ్ల సమస్యల్ని సమర్థంగా ఎదుర్కొనవచ్చు

Show Full Article
Print Article
Next Story
More Stories