Shampoos: యువతకి హెచ్చరిక.. ఈ బ్రాండెడ్‌ షాంపులు చాలా డేంజరస్‌..!

Are you Using These Branded Shampoos get rid of Them Immediately Otherwise There is a Risk of Cancer
x

Shampoos: యువతకి హెచ్చరిక.. ఈ బ్రాండెడ్‌ షాంపులు చాలా డేంజరస్‌..!

Highlights

Shampoos: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన యూనిలీవర్ కంపెనీ అనేక బ్రాండెడ్‌ షాంపులలో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నాయని వెల్లడించింది.

Shampoos: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన యూనిలీవర్ కంపెనీ అనేక బ్రాండెడ్‌ షాంపులలో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నాయని వెల్లడించింది. వెంటనే వాటిని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. యునిలీవర్ యూఎస్‌ మార్కెట్ నుంచి డోవ్, నెక్సస్, సువే, TIGI, TRESemme, Aerosol డ్రై షాంపూలను రీకాల్ చేసింది. ఒక నివేదిక ప్రకారం డ్రై షాంపూలో బెంజీన్ ఉనికిని కనుగొన్నారు. ఈ రసాయనం క్యాన్సర్‌కు కారణమవుతుందని తేలింది.

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ప్రకారం.. ఈ ఉత్పత్తులు అక్టోబర్ 2021కి ముందు తయారు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రిటైలర్‌లకు పంపిణీ చేశారు. వీటిలో డోవ్ డ్రై షాంపూ వాల్యూమ్, ఫుల్‌నెస్, డోవ్ డ్రై షాంపూ ఫ్రెష్ కోకోనట్, నెక్సస్ డ్రై షాంపూ రిఫ్రెషింగ్ మిస్ట్, సువేవ్ ప్రొఫెషనల్స్ డ్రై షాంపూ రిఫ్రెష్, రివైవ్ ఉన్నాయి. బెంజీన్ మానవులలో క్యాన్సర్‌ను కలిగించే శక్తిని కలిగి ఉంటుంది. ఇది అనేక విధాలుగా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

ఇది వాసన ద్వారా, నోటి ద్వారా, చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది లుకేమియా, బ్లడ్ క్యాన్సర్‌కు కారణమవుతుంది. ప్రజలు ఇటువంటి ఉత్పత్తులను ఉపయోగించడం మానేయాలని FDA సూచిస్తోంది. 2021లో Procter & Gamble కూడా 30 కంటే ఎక్కువ ఏరోసోల్ స్ప్రే హెయిర్‌కేర్ ఉత్పత్తులను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో డ్రై షాంపూ, డ్రై కండీషనర్ ఉన్నాయి. అయితే వాటిలో బెంజీన్ ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories