Health Tips: రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొని ఉంటున్నారా.. కచ్చితంగా ఈ వ్యాధి బారిన పడుతారు..!

Are You Staying Awake For A Long Time At Night You Will Definitely Get Type 2 Diabetes
x

Health Tips: రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొని ఉంటున్నారా.. కచ్చితంగా ఈ వ్యాధి బారిన పడుతారు..!

Highlights

Health Tips: ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్​ గాడ్జెట్ల వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో చాలామంది రాత్రిపూట ఆలస్యంగా పడుకుంటున్నారు.

Health Tips: ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్​ గాడ్జెట్ల వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో చాలామంది రాత్రిపూట ఆలస్యంగా పడుకుంటున్నారు. కొన్ని రోజులు గడిచాక దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు ఈ అలవాటు ఒక వ్యసనంగా మారుతుంది. దీంతో నిద్ర సంబంధించిన వ్యాధులతో పాటు టైప్​ 2 డయాబెటీస్​ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. రాత్రిపూట ఆలస్యంగా నిద్రించడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఈ రోజు తెలుసుకుందాం.

రాత్రి పొద్దుపోయే వరకు మెలకువగా ఉండే వారికి టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఒక పరిశోధనలో తేలింది. హార్వర్డ్ మెడిసిన్ స్కూల్ పరిశోధకులు 60 వేల మంది మహిళా నర్సులపై ఒక అధ్యయనం నిర్వహించారు. రాత్రిపూట పనిచేసే నర్సులు తక్కువ వ్యాయామం చేస్తూ అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారని ఈ అధ్యయనంలో తేలింది. దీనివల్ల పగటిపూట పనిచేసే వారితో పోలిస్తే రాత్రిపూట మేల్కొని పనిచేసే వ్యక్తులకు టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం 19 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.

నిద్రభంగం

అర్థరాత్రి వరకు మెలకువగా ఉండటం వల్ల శరీరంలో జీవక్రియ వ్యవస్థ క్షీణిస్తుంది. శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోయి టైప్ 2 డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధులు సంభవిస్తాయి. టైప్ 1 మధుమేహం జన్యుపరమైన కారణాల వల్ల వస్తే టైప్ 2 మధుమేహం ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల వల్ల వస్తుంది. మంచి జీవనశైలి అనుకరించడం వల్ల మధుమేహాన్ని కంట్రోల్​లో ఉంచవచ్చు. ప్రతి రోజు వ్యాయామం చేయడం, మంచి డైట్​ పాటించడం వల్ల మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories