Tattoo: పచ్చబొట్టు వేయించుకుంటున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!

Are you Getting a Tattoo Know its Disadvantages
x

Tattoo: పచ్చబొట్టు వేయించుకుంటున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!

Highlights

Tattoo: చాలా మంది టాటూలు వేయించుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా యూత్‌లో టాటూలపై క్రేజ్ ఎక్కువగా ఉంటుంది.

Tattoo: చాలా మంది టాటూలు వేయించుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా యూత్‌లో టాటూలపై క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. మీకు కూడా టాటూలు వేయించుకోవడం ఇష్టమైతే ముందుగా దానివల్ల జరిగే హాని గురించి తెలుసుకోండి. శరీరంపై పచ్చబొట్టు వేయించుకోవడం మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చవచ్చు కానీ అది మీ శరీరానికి అనేక నష్టాలను కలిగిస్తుంది. ఈ రోజు పచ్చబొట్టు నష్టాల గురించి తెలుసుకుందాం.

విషపూరిత సిరాలు

ఆస్ట్రేలియన్ ప్రభుత్వం చేసిన ఒక అధ్యయనంలో ఐదు పచ్చబొట్ల ఇంక్‌లలో ఒకటి క్యాన్సర్ కారక రసాయనాలను కలిగి ఉందని కనుగొన్నారు. ఇది ఆరోగ్యానికి చాలా తీవ్రమైనది. టాటూ ఇంక్‌లో అల్యూమినియం, కోబాల్ట్ ఉంటాయి. ఇది మీ చర్మానికి చాలా హానికరం.

కండరాలను దెబ్బతీస్తుంది

మీరు చర్మంపై టాటూలు వేయించుకోవడానికి ఇష్టపడితే అది చర్మం, కండరాలకు చాలా నష్టం కలిగిస్తుంది. వీటిలో సూది మీ శరీరం లోతుకి గుచ్చుతుంది. ఇది మీ కండరాలకు చాలా నష్టం కలిగిస్తుంది. శరీరంలో పుట్టుమచ్చ ఉన్న ప్రదేశంలో టాటూలు వేయించుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

హెపటైటిస్ బి ప్రమాదం

మీరు పచ్చబొట్టు వేయించుకోవాలంటే మొదట హెపటైటిస్ బి వ్యాక్సిన్‌ను వేయించుకోవకాలి. నిపుణుడి నుంచి మాత్రమే టాటూ వేయించుకోవాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. వాస్తవానికి నిపుణులు పరిశుభ్రత, పరికరాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అదే సమయంలో మీరు టాటూ వేయించుకున్న చోట ప్రతిరోజూ యాంటీబయాటిక్ క్రీమ్ రాయాలి. లేదంటే సెప్టిక్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories