Lemon Water : ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతున్నారా? అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి

Lemon Water : ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతున్నారా? అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి
x

Lemon Water : ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతున్నారా? అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి

Highlights

చాలామంది ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో నిమ్మరసం కలిపిన నీటిని తాగుతారు. ఈ అలవాటు చాలా రకాలుగా ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, దాని వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి. నిమ్మరసంలో మంచి గుణాలు ఉన్నప్పటికీ, ఏదైనా అతిగా తీసుకుంటే విషమే అవుతుంది.

Lemon Water : చాలామంది ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో నిమ్మరసం కలిపిన నీటిని తాగుతారు. ఈ అలవాటు చాలా రకాలుగా ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, దాని వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి. నిమ్మరసంలో మంచి గుణాలు ఉన్నప్పటికీ, ఏదైనా అతిగా తీసుకుంటే విషమే అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చాలామంది రకరకాల ఆరోగ్య సలహాలను పాటిస్తుంటారు. అయితే, వాటి వల్ల కలిగే లాభాలతో పాటు నష్టాలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా నిమ్మరసం అందరికీ మంచిది కాదు. అయితే, నిమ్మరసం తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకు మంచిది కాదో ఈ వార్తలో తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల కలిగే నష్టాలు

* ఎముకలు బలహీనపడతాయి: ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. నిమ్మలో ఉండే ఆమ్లత్వం ఎముకల్లోని కొవ్వును తగ్గించి, వాటిని బలహీనపరుస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ ఇది ఎముకల సమస్యలకు దారితీయవచ్చు.

* పళ్లు దెబ్బతింటాయి: నిమ్మలో ఉండే ఆమ్లత్వం పంటి ఎనామిల్‌ను దెబ్బతీసి, పళ్లను సున్నితంగా మారుస్తుంది. ఇది పంటి బలాన్ని తగ్గిస్తుంది.

* డీహైడ్రేషన్: ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసంలో ఉండే అధిక ఆస్కార్బిక్ ఆమ్లం మూత్ర విసర్జనను పెంచుతుంది. అందువల్ల, నిమ్మరసాన్ని తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

* యాసిడిటీ, గుండెల్లో మంట: ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల కడుపులో అధికంగా యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది యాసిడిటీ, గుండెల్లో మంట, వాంతులు, గ్యాస్ వంటి సమస్యలకు కారణం కావచ్చు.

* కిడ్నీపై ఒత్తిడి: నిమ్మలో ఉండే కొన్ని గుణాలు కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో నిమ్మలోని సిట్రిక్ ఆమ్లం, ఆక్సలేట్లు కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే భోజనం తర్వాత నిమ్మరసం తాగితే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.

* అతిసారం, వాంతులు: అతిగా నిమ్మరసం తాగడం వల్ల అతిసారం, వికారం, గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. ఎందుకంటే శరీరానికి అవసరమైన విటమిన్ సి కంటే ఎక్కువ నిమ్మరసం తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది.

* గొంతు నొప్పి: నిమ్మరసంలో ఉండే ఆమ్లత్వం గొంతులోని శ్లేష్మ పొరను చికాకు పెట్టి గొంతు నొప్పికి కారణం కావచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories