LDL Cut Fruit: రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారా? రోజూ ఈ ఒక పండు తింటే చాలు.. ఫలితం అద్భుతం!

LDL Cut Fruit: రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారా? రోజూ ఈ ఒక పండు తింటే చాలు.. ఫలితం అద్భుతం!
LDL Cut Fruit: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది 'చెడు కొలెస్ట్రాల్' (LDL) బారిన పడుతున్నారు.
LDL Cut Fruit: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది 'చెడు కొలెస్ట్రాల్' (LDL) బారిన పడుతున్నారు. ఇది క్రమంగా రక్తపోటు (BP), మధుమేహం (Diabetes) వంటి సమస్యలకు దారితీసి, చివరకు ప్రాణాంతకమైన గుండెపోటుకు కారణమవుతోంది. అయితే, మన ఇంట్లో ఉండే ఒకే ఒక్క పండుతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆపిల్‌తో ఆరోగ్య ప్రయోజనాలు:
చెడు కొలెస్ట్రాల్ నివారిణి: ఆపిల్‌లో ఉండే 'పెక్టిన్' అనే కరిగే ఫైబర్ (Soluble Fiber) రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
మధుమేహ నియంత్రణ: డయాబెటిస్‌తో బాధపడేవారు రోజూ ఒక ఆపిల్ తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
గుండెకు రక్షణ: ఆపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్-సి మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.
హార్మోన్ల సమతుల్యత: ఇందులో ఉండే విటమిన్-డి ఎంజైమ్స్ హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడి, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
వైద్యులు సైతం "An apple a day keeps the doctor away" అని ఊరికే అనలేదు. రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల రక్తంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరిగి, ప్రాణాంతక గుండె జబ్బుల నుండి రక్షణ లభిస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



