Weight Loss: ఈ దేశీ పానీయం 30 రోజుల్లో బరువు తగ్గిస్తుంది.. అదేంటంటే..?

Weight Loss: ఈ దేశీ పానీయం 30 రోజుల్లో బరువు తగ్గిస్తుంది.. అదేంటంటే..?

Jyothi
Published on: 26 Aug 2022 12:13 PM IST
Apple cider vinegar and baking soda for weight loss
X

Weight Loss: ఈ దేశీ పానీయం 30 రోజుల్లో బరువు తగ్గిస్తుంది.. అదేంటంటే..?

Weight Loss: కొవిడ్‌ తర్వాత లాక్డౌన్, వర్క్‌ ఫ్రం హోం వల్ల శరీరాలు సోమరిగా మారాయి. శారీరక కార్యకలాపాలు గణనీయంగా తగ్గడంతో చాలామంది విపరీతంగా బరువు పెరిగారు. నడుము, పొత్తికడుపు చుట్టూ బెల్లీ ఫ్యాట్ పేరుకుపోయింది. దీన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. ఊబకాయం వల్ల అనేక ఇతర వ్యాధులను విజృంభిస్తాయి. వీటిలో అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, అధిక బీపీ వంటివి ఉన్నాయి. అయితే ఒక దేశీ పానీయం తాగడం వల్ల నెల రోజుల్లో పెరిగిన బరువుని తగ్గించుకోవచ్చు. దాని గురించి తెలుసుకుందాం.

బరువు తగ్గించుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్, బేకింగ్ సోడా ఉపయోగపడుతాయి. ఈ రెండింటి కలయిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఆపిల్ సైడర్ వెనిగర్, బేకింగ్ సోడాతో చేసిన పానీయం బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని, జీవక్రియను పెంచుతుంది. ఇది క్యాలరీలను బర్న్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ తొందరగా కరుగుతుంది. మీరు దీన్ని 30 రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే ఆశించిన ఫలితాలను పొందడం ప్రారంభిస్తారు. దీన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

ఈ పానీయం సిద్ధం చేయడం చాలా సులభం. దీని కోసం మీరు ఒక గ్లాసు నీటిని తీసుకోవాలి. ఇందులో ఒక చెంచా బేకింగ్ సోడా, 2 చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. రెండూ బాగా కలిపిన తర్వాత తాగాలి.మన రోజువారీ జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా ఊబకాయానికి కారణమవుతాయి. కాబట్టి ప్రతిరోజు వ్యాయామం చేయడం అవసరం.

Jyothi

Jyothi

Next Story