Amla: ఈ కాలంలో ఉసిరి తింటే ఎన్నో లాభాలు

Amla: ఈ కాలంలో ఉసిరి తింటే ఎన్నో లాభాలు
x
Highlights

Amla: ఉసిరి అంటేనే లాభాలు. కాలం ఏదైనా ఉసిరి తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగ వానాకాలంలో చాలమంది సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు.

Amla: ఉసిరి అంటేనే లాభాలు. కాలం ఏదైనా ఉసిరి తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగ వానాకాలంలో చాలమంది సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. అదేవిధంగా శ్వాస కోస ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. వీటిన్నింటి నుండి బయటపడేసేది ఈ ఉసిరి మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.

ఇమ్యూనిటీ పెంచడంలో కీలక పాత్ర

వానాకాలంలో ఇన్ఫెక్షన్లు తొందరగా ప్రబలుతుంటాయి. దీనికి ముఖ్యమైన కారణం శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోవడమే. ఆయన ప్రతి రోజూ ఉసిరిని తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల అంటువ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే ఉసిరిలో విటమిన్ సి అత్యధిక మోతాదులో ఉంటుంది. ఆరు బత్తాయి పండ్లలో ఉండేంత విటమిన్ సి ఒక ఉసిరికాయలోనే ఉంటుంది. అందువల్ల ఈ సీజన్‌లో తరచూ ఉసిరి కాయను తినాలి.

ఇలా తీసుకుంటే మంచిది..

ఉసిరికాయలు బాగా దొరికనప్పుడు వాటిని పొడి చేసి పెట్టుకుని కావాల్సినపుడు ఆ పొడిని నీటిలో కలిపి తాగొచ్చు. లేదా ఆ పొడిని నీటిలో కలిపి వాటిని ఐస్ క్యూబ్స్ ట్రేలలో వేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఇవి ఐస్ క్యూబ్స్‌గా మారిన తర్వాత రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక ఐస్ క్యూబ్ వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ఉసరికాయలను ముక్కలుగా కోసి, వాటిలో కాస్త నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. ఈ నీటిలో కాస్త తేనె కలిపి ఉదయాన్నే తాగితే డయాబెటీస్ రోగులకు చాలామంచిది. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండేలా ఉసిరి చేస్తుంది. అంతేకాదు షుగర్ కు బోర్డర్ లో ఉండేవాళ్లు తరచూ ఈ రసాన్ని ఉదయాన్నే తాగడం వల్ల శాశ్వతంగా షుగర్ రాకుండా ఉంటుంది. అంతేకాదు, ఉదయాన్నే ఉసిరి రసం తాగడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories