Health Tips: పీచు పండ్లలో అద్భుత పోషకాలు.. ప్రమాదకరమైన వ్యాధులు దూరం..!

Amazing nutrients in peaches these diseases are far away
x

Health Tips: పీచు పండ్లలో అద్భుత పోషకాలు.. ప్రమాదకరమైన వ్యాధులు దూరం..!

Highlights

Health Tips: పీచు పండ్లలో అద్భుత పోషకాలు.. ప్రమాదకరమైన వ్యాధులు దూరం..!

Health Tips: పీచు ఎక్కువగా లభించే పండ్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ పండ్ల రుచిని చాలా మంది ఇష్టపడతారు. వీటిలో పోషకాల కొరత ఉండదు. విటమిన్ సి, విటమిన్ ఎ, నియాసిన్, కాపర్, మాంగనీస్, ప్రొటీన్, ఫైబర్ వంటివి అధికంగా ఉంటాయి. యాపిల్‌, జామ, బత్తాయి, నారింజ, దానిమ్మ వంటి పండ్లలో అధిక శాతం పీచు ఉంటుంది. ఈ పండ్ల వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఈ రోజు తెలుసుకుందాం.

1. గుండె ఆరోగ్యం

మీరు రోజూ పీచు ఉండే పండ్లని తింటే గుండెకు చాలా మంచిది. ఈ పండ్లు అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. అంతేకాదు పీచు ట్రైగ్లిజరైడ్‌ను కూడా తగ్గిస్తుంది. భారతదేశంలో గుండెజబ్బుల వల్ల చాలామంది చనిపోతున్నారు. అందుకే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే పండ్లని తప్పనిసరిగా తినాలి.

2. క్యాన్సర్ నివారణ

క్యాన్సర్ అనేది ప్రారంభ దశలో గుర్తించకుంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. క్యాన్సర్‌ను నివారించడానికి పీచు అధికంగా ఉండే పండ్లని తినాలి. ఎందుకంటే ఇందులో కెరోటినాయిడ్లు, కెఫిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి.

3. అజీర్ణం నుంచి ఉపశమనం

తరచుగా జిడ్డు, కారంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, అసిడిటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సందర్భంలో మీరు పీచు అధికంగా ఉండే పండ్లని తినాలి. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు చాలా సహాయపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories