Drumstick Leaves: మునగ ఆకుల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Amazing Benefits of Drumstick Leaves
x

Drumstick Leaves: మునగ ఆకుల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Highlights

Drumstick Leaves: మునగ ఆకుల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Drumstick Leaves: మునగ ఆకుల్లో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల తీవ్రమైన వ్యాధులు దూరంగా ఉంటాయి. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మునగ కషాయాన్ని ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది దంతాలు దృఢంగా మారడంలో సహాయం చేస్తుంది. ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

మునగ ఆకులను ఎలా తీసుకోవాలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ముందుగా ఒక పాత్రలో రెండు కప్పుల నీటిని వేడి చేయండి. అందులో మునగ ఆకులు వేసి మరిగించండి. అవసరమైతే ఆకులతో పాటు బీన్స్ కట్ చేసి వేయవచ్చు. నీరు సగానికి తగ్గే వరకు మరిగించి నల్ల మిరియాల పొడి, నల్ల ఉప్పు కలిపి వడపోసి తాగాలి. మునగలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలు, దంతాలని దృఢంగా మార్చడంతో పాటు బరువుని కంట్రోల్‌ చేస్తుంది.

రక్తాన్ని శుభ్రపరచడంలో మునగ ఆకులు బాగా ఉపయోగపడతాయి. మధుమేహం, హృద్రోగులకు ఇది వరం కంటే తక్కువేమి కాదు. మునగ ఆకుల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది. మునగ ఆకు కూర తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బీపీ కూడా నియంత్రణలోకి వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories