Health News: మంచి కొలస్ట్రాల్‌కి ఈ ఆహారాలు సూపర్..!

All Three of these Foods are Essential for Good Cholesterol | Health Care Tips
x

Health News: మంచి కొలస్ట్రాల్‌కి ఈ ఆహారాలు సూపర్..!

Highlights

Health News: మారిన జీవన పరిస్థితుల వల్ల ప్రతి ఒక్కరిలో కొలస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది...

Health News: మారిన జీవన పరిస్థితుల వల్ల ప్రతి ఒక్కరిలో కొలస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిజానికి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. ఒకటి మంచిది, మరొకటి చెడ్డది. చెడ్డ కొలెస్ట్రాల్‌ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు. అంతే కాకుండా వ్యాయామం చేయకపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

వారానికి 3 సార్లు గుడ్లు తినండి

గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అయితే గుడ్డులోని పసుపు భాగాన్ని తినకూడదని కొంతమంది చెబుతారు. అయితే ఊబకాయం ఉన్నవాళ్లు తినకపోవడం మంచిది. ప్రతి ఒక్కరు వారానికి 3 సార్లు గుడ్లు తినవచ్చు.

చేపలలో కొలెస్ట్రాల్ తక్కువ

చేపలను తినడం వల్ల పెరిగిన కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది. చేపలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో చెడు కొలస్ట్రాల్‌ తక్కువగా ఉంటుంది. మంచి కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది.

ఆహారంలో తృణధాన్యాలు చేర్చండి

మీ ఆహారంలో తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ పెరిగిన కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటే గుండెపోటు ప్రమాదం తక్కువగా ఉంటుంది. అలాగే ఆహారంలో పండ్లు, ఆకుపచ్చ కూరగాయలను తప్పనిసరిగా ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories