Bone Health: ఎముకల కోసం కాల్షియం, విటమిన్‌ డి మాత్రమే కాదు నిర్మాణంలో ఇవి చాలా ముఖ్యం..!

All These Nutrients Not Just Calcium And Vitamin D Help Strengthen Bones
x

Bone Health: ఎముకల కోసం కాల్షియం, విటమిన్‌ డి మాత్రమే కాదు నిర్మాణంలో ఇవి చాలా ముఖ్యం..!

Highlights

Bone Health: ఎముకలు లేకుండా మన బాడీని ఊహించుకోలేం. వీటి ద్వారానే శరీర నిర్మాణం జరుగుతుంది. అలాంటి ముఖ్యమైన ఎముకలు బలంగా ఉండటం ఒక మనిషికి చాలా అవసరం.

Bone Health: ఎముకలు లేకుండా మన బాడీని ఊహించుకోలేం. వీటి ద్వారానే శరీర నిర్మాణం జరుగుతుంది. అలాంటి ముఖ్యమైన ఎముకలు బలంగా ఉండటం ఒక మనిషికి చాలా అవసరం.vఇవి బలహీనంగా మారితే శరీరం మొత్తంపై ఎఫెక్ట్‌ పడుతుంది. రోజువారీ జీవితంలో సాధారణ పనులు చేసుకోవడం కష్టంగా మారుతుంది. ఆరోగ్యకరమైన ఎముకల కోసం, కాల్షియం, విటమిన్ డి మాత్రమే కాదు ఇంకా చాలా అవసరమవుతాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

విటమిన్ సి

విటమిన్‌ సి పండ్లు, కూరగాయల్లో సమృద్ధిగా లభిస్తుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది ఎముకలు విరగకుండా చేస్తుంది.

మెగ్నీషియం

మెగ్నీషియం ఎముక తయారీలో ఉపయోగపడుతంది. దీని కారణంగా ఎముకలు బలంగా మారుతాయి.

పొటాషియం

పొటాషియం మూత్రపిండాల్లో కాల్షియంను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. యాసిడ్-బేస్ స్థాయిల్లో సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా ఎముక దెబ్బతినకుండా చేస్తుంది.

ప్రొటీన్

ప్రొటీన్‌ శరీరంలో కాల్షియం శోషణకు సహాయం చేయడం, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 (IGF-1) స్రావాన్ని పెంచడం, లీన్ బాడీని ప్రోత్సహించడం చేస్తుంది. ప్రోటీన్ తీసుకోవడం ఎముక ఆరోగ్యంపై పాజిటివ్‌ ప్రభావాన్ని చూపుతుంది.

భాస్వరం

పిల్లలు ఎదిగే వయసులో ఉన్నప్పుడు భాస్వరం అవసరం. ఈ పోషకం లోపం ఉంటే ఎముకల నిర్మాణంలో సమస్యలు ఎదురవుతాయి.

విటమిన్ K

విటమిన్‌ కె ఆకుపచ్చని ఆకు కూరల్లో ఉంటుంది. అవసరమైన ఎముక ప్రొటీన్‌లను సక్రియం చేయడంలో ముఖ్యమైన పాత్ పోషిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

జింక్

జింక్‌ ఎముకల ఖనజీకరణకు సహాయపడే ఎంజైమ్‌ల నిర్మాణంలో సహాయపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories