
మానవ శరీర భాగాలైన ముక్కు , కళ్లు, చెవులు, గొంతు, ఊపిరితిత్తులు, చర్మం ఎప్పుడో ఒకసారి తప్పక అలర్జీకి ప్రభావితమవుతాయి. కొన్ని అలర్జీలు సీజన్‌లను...
మానవ శరీర భాగాలైన ముక్కు , కళ్లు, చెవులు, గొంతు, ఊపిరితిత్తులు, చర్మం ఎప్పుడో ఒకసారి తప్పక అలర్జీకి ప్రభావితమవుతాయి. కొన్ని అలర్జీలు సీజన్‌లను అనుగుణంగా వస్తే మరికొన్ని 365 రోజులు వేధిస్తుంటాయి. సీజన్ అనుగుణంగా వచ్చే అలర్జీలను సీజన్ , ఏడాదంతా వేధించే వాటిని పెరీనియల్ అని అంటారు. ఈ అర్జీలు చిన్న పిల్లల నుంచి వయస్సు పైబడిన వారికి వస్తుంటాయి.
పెరీనియల్‌లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఇండోల్ , మరోకటి ఔట్‌డోర్ అలర్జీలు.ఈ అలర్జీలు వాతావరణంలో నెలకొనే మార్పుల వల్ల రావచ్చు, లేదా తీసుకునే ఆహారంతో సంభవించవచ్చు. ముఖ్యంగా చర్మ సంబంధిత అలర్జీలు విభిన్నంగా ఉంటాయి. బయటకు కనిపిస్తూ చాలా ఇబ్బంది పెడతాయి.
చర్మ సంబంధిత అలర్జీలు ముఖ్యంగా కొన్ని రకాలైన ఆహారాలు తీసుకోవడం మందులు వాడటం వల్ల వస్తుంటాయి. వీటి ప్రభావం వల్ల దద్దుర్లు ఏర్పడటం, దురద పెట్టడం వంటివి ఉంటాయి..ఇందులో తత్కాలిక చర్మ సమస్యలతో పాటు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. తాత్కాలిక సమస్యలను సహజ పద్ధతుల్లో నివారించ వచ్చు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం పొందాలంటే నిపుణులు సలహా పాటించాల్సిందే.
సూక్ష్మజీవులను చంపేసహజ సిద్ధమైన గుణాలు కొబ్బరి నూనెలో ఉంటాయి. ఈ కొబ్బరి నూనె చాలా వరకు చర్మ సమస్యలను నివారిస్తుంటాయి. అలర్జీ ప్రభావిత ప్రాంతాల్లో నూనెను రాయడం వల్ల చాలా ఉపశమనం పొందవచ్చు. వేప నుంచి తయారైన ఉత్పత్త్తుల్లో యాంటా బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చర్మంపై ఏర్పడే అలర్జీలైన గజ్జి, తామర, దురదలతో పాటు మొటిమలను ఇవి నివారిస్తాయి. ఇక సహజసిద్ధంగా ఇంట్లో లభించే దివ్య ఔషధం తేనె. అన్ని రకాల చర్మ సమస్యలకు తేనె మంచి మందుగా పనిచేస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయలు చర్మ సమస్యల నివారణకు చక్కగా పనిచేస్తుంది. ఔషదాల్లో , సౌందర్య సాధనాల్లో వినియోగించే కలబంద చర్మ సమస్యలైన దురదలను , చిరాకులను తొలగించడంలో చక్కగా పనిచేస్తుంది.
అలర్జీ వచ్చిన తరువాత జాగ్రత్తలు తీసుకునే కంటే ముందు జాగ్రత్తలు తప్పనిసరి వీలైనంత వరకు మనం తిరిగే చుట్టుపక్కన ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వినియోగించే బెడ్‌షీట్‌లను, దిండ్లను,కార్పెట్లు, కర్టెన్‌లు ఇలా ఇంట్లో ఉండే ప్రతీ వస్తువుని శుభ్రపరచాలి. ఎందుకంటే ఇవి అపరిశుభ్రంగా ఉండటం వల్లే అలర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులను ఇంట్లోపెంచకూడదు..వాటి కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తేనే ఉత్తమం. వాతావరణంల వచ్చే మార్పులకు అనుగుణంగా శరీరాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి. చలికాలంలో బయటకు వెళ్లేటప్పుడు వెచ్చదనం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఆహారం తీసుకోవడం వల్ల అలర్జీ వచ్చినా..దాన్ని తినడాన్ని మానెయ్యడమే ఉత్తమం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



