Women Health: పీసీఓఎస్‌ సమస్యలో ఏవి తినాలి.. ఏవి తినకూడదు..!

Alert for Women if you Have PCOS Problem you Should Stay Away From These
x

Women Health: పీసీఓఎస్‌ సమస్యలో ఏవి తినాలి.. ఏవి తినకూడదు..!

Highlights

Women Health: ఈ రోజుల్లో మహిళల్లో పీసీఓఎస్ సమస్య విపరీతంగా పెరిగుతోంది.

Women Health: ఈ రోజుల్లో మహిళల్లో పీసీఓఎస్ సమస్య విపరీతంగా పెరిగుతోంది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) కారణంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. పిసిఒఎస్‌ వల్ల స్త్రీల శరీరంలో పురుషుల హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీని కారణంగా చాలా మంది స్త్రీలలో పురుషుల మాదిరిగా గడ్డం, పెదవులపై జుట్టు రావడం ప్రారంభమవుతుంది. PCOSలో బుతుచక్రం సరైన విధానంలో ఉండదు. దీని కారణంగా గర్భం దాల్చడంలో సమస్య ఉంటుంది. PCOS సమస్య జన్యువులు, పర్యావరణం, జీవనశైలిలో మార్పుల కారణంగా ఏర్పడుతుంది. డైట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. లేకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. PCOS విషయంలో ఏవి తినాలి, ఏవి తినకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు

పీసీఓఎస్‌లో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కూరగాయలు, పండ్లని ఎక్కువగా తీసుకోవాలి. ఇటువంటి పోషకాలు కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఫైబర్ జీర్ణక్రియలో మేలు చేస్తుంది.

ఆరోగ్యకరమైన అల్పాహారం

PCOS ఉంటే ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తినాలి. మార్కెట్‌లోని చిప్స్, కరకరలాడే స్నాక్స్‌ వంటివి తినకూడదు. అల్పాహారంలో బాదం, వాల్‌నట్స్ వంటి ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవాలి.

ప్రోటీన్ ఫుడ్‌

పీసీఓఎస్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మేలు చేస్తుంది. కోడిగుడ్లు, పాలు, పప్పు వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పిసిఒఎస్ వల్ల ప్రొటీన్ లోపిస్తే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

శోథ నిరోధక ఆహారం

PCOS ఉన్నట్లయితే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండే వాటిని తినాలి. అల్లం, పసుపు, వెల్లుల్లి, తులసి వంటి వాటిని తీసుకోవాలి. వీటిలో ఉండే ఔషధ గుణాలు కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వాపును తొలగించడానికి పని చేస్తాయి. ఇవి బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తాయి.

వీటిని తినకూడదు..

పిసిఒఎస్‌లో కార్బోహైడ్రేట్‌లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మధుమేహానికి కారణమవుతాయి. బ్రెడ్‌ వంటివి తినడం మానుకోవాలి. అన్నం తినడం వల్ల హాని కలుగుతుంది. తక్కువగా తీసుకోవాలి. ఎక్కువ వేయించిన, కారంగా ఉండే వాటిని తినడం మానుకుంటే మంచిది. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories