ఖర్జూరాలతో ఎన్ని ప్రయోజనాలో..

పండ్లు తినడం వల్ల అనేక రకాల అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రుచితో పాటు అనేక పోషకాలు వాటిలో ఉంటాయి. ఒక్కో...
పండ్లు తినడం వల్ల అనేక రకాల అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రుచితో పాటు అనేక పోషకాలు వాటిలో ఉంటాయి. ఒక్కో ప్రూట్‌లో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయి. వాటిలో ఖర్జూరం పండు తినడం వల్ల వివిధ రకాల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీరానికి తక్షణ శక్తినిచ్చే పండ్లలో ముందు వరుసలో నిలిచేవి ఖర్జూరాలే. వాటిలోని వివిధ రకాల ఔషద గుణాలు మెదడుకూ కూడా ఎంతో మేలుచేస్తాయి. విటమిన్లతో పాటు , పాస్పరస్, ఫైబర్,కాల్షియం, ఐరన్‌లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాన్ని 'ప్రోటీన్స్ పవర్ హౌస్' అని కూడా పిలుస్తుంటారు.
వాటిని రోజుకూ మూడు చొప్పున తీసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఐరన్ అధికంగా ఉన్న ఖర్జూరాలను తీసుకోవడం వల్ల అనీమియా సమస్యలు రావు. అలాగే జియాక్సిథిన్, టూటిన్స్ అధికంగా ఉండి..కళ్ల సమస్యలకు రాకుండా పరిష్కరిస్తుంది.ఎండు ఖర్జూరాలను నానబెట్టి పరగడపున తినడం వల్ల గుండె జబ్బులు రావు. జీర్ణ సమస్యలు, మలబద్ధకం సమస్య బాధపడుతున్నవారు రాత్రి పూట 2,3 ఖర్జూరాలు తింటే ఫలితం ఉంటుంది.
ఖర్జూరాల తరుచుగా తినడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడేవారు ఖర్జూరాలను నీటిలో వేసి వేడి చేసి నల్లమిరియాల పొడి, యాలకుల పొడి కలిపి దాన్ని రాత్రిపూట తాగితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. బాలింతలు వీటిని తీసుకోవడం వల్ల పాలు ఎక్కువగా వస్తాయి. డేట్స్‌లో హెల్తీ న్యూట్రీషియన్స్ ఉండటం వల్ల స్వీట్స్ తిన్న ఫీలింగ్‌తో పాటు బరువును కూడా తగ్గిస్తుంది.ప్రొద్దున పూట వాటిని తినడం వల్ల షుగర్ లవల్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. వాటిలో పోటాషియం ఎక్కువగా ఉండటం వల్ల స్ర్టోక్ రాకుండా ఉంటాయి.
లైవ్ టీవి
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
5 Dec 2019 5:10 PM GMTIndia vs West Indies : కొత్త రూల్ ఇదే
5 Dec 2019 4:23 PM GMTఉల్లి సమస్య త్వరలోనే ఒక కొలిక్కి వస్తుంది
5 Dec 2019 4:15 PM GMTక్వీన్ ట్రైలర్ : రమ్యకృష్ణపై ప్రశంసల వెల్లువ
5 Dec 2019 3:22 PM GMTముగిసిన కర్ణాటక ఉపఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్ని ఆ...
5 Dec 2019 2:48 PM GMT