Insects: శ‌రీరాన్ని ఆశ్ర‌యంగా మార్చుకునే కీట‌కాలు.. చ‌ర్మంపై నివ‌సించే వాటి గురించి తెలుసా?

Insects
x

Insects: శ‌రీరాన్ని ఆశ్ర‌యంగా మార్చుకునే కీట‌కాలు.. చ‌ర్మంపై నివ‌సించే వాటి గురించి తెలుసా?

Highlights

Insects: మన చుట్టూ కనిపించే చాలా రకాల ప్రాణుల్లో, కీటకాలు ఓ ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. వాటిలో కొన్ని మన శరీరాన్ని ఆశ్రయంగా చేసుకుంటూ జీవిస్తాయి. మనకూ తెలియకుండా ఇవి చర్మంపై నివసిస్తూ దురద, అలర్జీ వంటి సమస్యలకు కారణమవుతుంటాయి.

Insects: మన చుట్టూ కనిపించే చాలా రకాల ప్రాణుల్లో, కీటకాలు ఓ ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. వాటిలో కొన్ని మన శరీరాన్ని ఆశ్రయంగా చేసుకుంటూ జీవిస్తాయి. మనకూ తెలియకుండా ఇవి చర్మంపై నివసిస్తూ దురద, అలర్జీ వంటి సమస్యలకు కారణమవుతుంటాయి. ఈ చిన్న కీటకాలు కంటికి కనిపించకపోయినా, వాటి ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటుంది. శ‌రీరాన్ని ఆశ్ర‌యంగా మార్చుకునే కొన్ని కీట‌కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నల్లి:

బెడ్ బగ్స్ మంచాలు, పాత ఫర్నిచర్, గోడల పగుళ్లలో దాక్కుంటాయి. ఇవి రాత్రివేళల్లో బయటకు వచ్చి, మన శరీరాన్ని కొరుకుతూ రక్తాన్ని తాగుతాయి.

తల పేను:

తల పేను జుట్టులో ఉండి రక్తాన్ని పీలుస్తాయి. ఇవి ఎగరలేవు కానీ పాకుతాయి. ఈ కీటకాలు ఒకరి నుంచి మరొకరికి తలపాగులు, దుప్పట్లు ద్వారా సులభంగా వ్యాపిస్తాయి. వాటి గుడ్లు (నిట్స్) జుట్టుకు బలంగా అతుక్కుంటాయి.

గోమార్లు:

ఇవి ఎక్కువగా కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువులపై కనిపిస్తాయి. కానీ అవి మనల్ని కూడా కుడతాయి. మన శరీరంపై దురద, ఎర్రటి పుపుసలు కలిగిస్తాయి. ఇవి జంతువుల నుంచి మనకు చేరుతాయి.

బాడీ లైస్:

ఇవి మనం ధరించే బట్టల్లో ఉంటాయి. శరీరానికి తగిలినప్పుడు చర్మాన్ని కొరికి రక్తాన్ని తాగుతాయి. అందుకే దుస్తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఉతుక్కొని ఎండ‌లో ఆర‌బెట్టమ‌ని చెబుతారు.

క్రాబ్ లైస్‌:

ఇవి జననేంద్రియాల ప్రాంతం, ఛాతీ జుట్టు, కనురెప్పల్లో ఉంటాయి. ఇవి "pubic lice" గా కూడా పిలుస్తారు. ఇవి శృంగారం ద్వారా లేదా దగ్గర సంబంధాల ద్వారా వ్యాపిస్తాయి. దురద, చర్మం ఎర్రబడటం వంటి సమస్యలకు కారణమవుతాయి.

డస్ట్ మైట్స్:

ఇవి మన శరీరంపై జీవించవు, కానీ మన బెడ్‌షీట్లు, పాత సోఫాలు, కార్పెట్లలో ఎక్కువగా ఉంటాయి. మన శరీరం నుంచి వచ్చే డెడ్ స్కిన్ ఫ్లేక్స్‌నే ఇవి ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఎక్కువగా శ్వాసకోశ సమస్యలు, అలెర్జీలకు కారణం అవుతాయి.

స్కాబీస్ మైట్స్:

ఈ మైట్స్ చర్మం లోపల దూరి దురదను కలిగిస్తాయి. వేళ్ల మధ్య, మణికట్టులు, నడుము వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. స్కాబీస్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.

డెమోడెక్స్ మైట్స్‌:

ఇవి కనురెప్పల వెంట్రుకల చుట్టూ జీవించే సూక్ష్మ పురుగులు. ఇవి చర్మం నుంచి వచ్చే ఆయిల్, మృత కణాలను తింటూ జీవిస్తాయి. ఎక్కువగా ఉన్నప్పుడు దురద, ఎర్రదనం కనిపించవచ్చు.

టిక్స్‌:

టిక్స్ ఎక్కువగా గడ్డి పొదల్లో, అడవుల్లో ఉంటాయి. ఇవి చర్మానికి పాకి రక్తాన్ని తాగుతాయి. కొన్ని టిక్స్ లైమ్ వ్యాధి వంటి ఇన్ఫెక్షన్లు వ్యాపింపజేస్తాయి. టిక్స్ నివారణకు శ‌రీరాన్ని పూర్తిగా క‌వ‌ర్ అయ్యేలా దుస్తులు ధరించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories