గర్భిణులు రక్తహీనతతో బాధపడితే ఈ 5 ఐరన్‌ రిచ్‌ ఫుడ్స్‌ బెస్ట్‌.. ఏంటంటే..?

5 Iron Rich Foods Best If Pregnant Women Suffer From Anemia
x

గర్భిణులు రక్తహీనతతో బాధపడితే ఈ 5 ఐరన్‌ రిచ్‌ ఫుడ్స్‌ బెస్ట్‌.. ఏంటంటే..?

Highlights

Pregnant Women: మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు చాలామంది రక్తహీనతతో బాధపడుతారు. ఎందుకంటే ఆ సమయంలో వారికి రక్తం చాలా అవసరమవుతుంది.

Pregnant Women: మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు చాలామంది రక్తహీనతతో బాధపడుతారు. ఎందుకంటే ఆ సమయంలో వారికి రక్తం చాలా అవసరమవుతుంది. అంతేకాకుండా పుట్టబోయే బిడ్డ పరిస్థితి కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. అందుకే వారికి వైద్యులు ఐరన్‌ సప్లిమెంట్లను ఎక్కువగా ఇస్తారు. వాటితో పాటు శరీరంలో సహజంగా రక్తం పెంచుకోవడానికి ఐదు ఆహారాలను తీసుకుంటే చాలు. త్వరగా కావలసిన రక్తం కవర్‌ అవుతుంది. ఆ ఆహరాలు ఏంటో తెలుసుకుందాం.

1. బీట్‌రూట్‌

బీట్‌రూట్‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని జ్యూస్‌, సలాడ్, సూప్ రూపంలో తీసుకోవచ్చు. దీన్ని తినడం వల్ల శరీరంలో రక్తం వేగంగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా బీట్‌రూట్ తినడం వల్ల శరీరం అన్ని సమస్యల నుంచి దూరంగా ఉంటుంది.

2. బచ్చలికూర

బచ్చలికూర ఆకులలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తాన్ని వేగవంతం చేయడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వాటి వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు.

3. ఎండుద్రాక్ష

ఎండు ద్రాక్షలో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. రక్తం లేకపోతే ప్రతిరోజు వీటిని ఏదో ఒక విధంగా తీసుకోవాలి. కొన్ని ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి, ఉదయం పరగడుపున తింటే చాలా మంచిది. శరీరంలో రక్తం వేగంగా పెరుగుతుంది.

4. దానిమ్మ గింజలు

దానిమ్మ గింజల్లో రక్తాన్ని పెంచే గుణాలు అధికంగా ఉంటాయి. రక్తహీనతను అధిగమించడానికి రోజూ ఒక దానిమ్మపండు తినాలి. లేదా ఒక గ్లాసు దానిమ్మ రసం తాగాలి. కొన్ని రోజుల్లో మంచి ఫలితాలు చూస్తారు. చర్మం కూడా మంచి రంగుకి వస్తుంది. సి విటమిన్‌ కూడా లభిస్తుంది.

5. జామకాయ

జామకాయలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శీతాకాలంలో జామ ఎక్కువగా దొరుకుతుంది. ఇది కడుపు సమస్యలను కూడా తొలగిస్తుంది. కానీ జామపండు తినేముందు ఒకసారి వైద్యుడి సలహా తీసుకుంటే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories