Hairstyles: పొడవాటి జుట్టు ఉన్నవారికి నప్పే 3 హెయిర్ స్టైల్స్

Hairstyles
x

Hairstyles: పొడవాటి జుట్టు ఉన్నవారికి నప్పే 3 హెయిర్ స్టైల్స్

Highlights

Hairstyles: చాలామందికి అందమైన పొడవాటి జుట్టు ఉంటుంది. కానీ ఈ పొడవైన జుట్టుతో ఎలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలో అంతగా తెలియదు.

Hairstyles: చాలామందికి అందమైన పొడవాటి జుట్టు ఉంటుంది. కానీ ఈ పొడవైన జుట్టుతో ఎలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలో అంతగా తెలియదు. అందుకే ఇంట్లో ఏ పార్టీ వచ్చినా, ఫంక్షన్ వచ్చినా ఒక జడ వేసుకుని సర్దుకుపోతుంటారు. అయితే ఈసారి మీ పొడవాటి జుట్టుతో ఈ హెయిర్ స్టైల్స్ ని ట్రై చేయండి. అందరిలోనూ మీరే స్పెషల్ గా కనిపిస్తారు.

ఈ మధ్య ఏ సెలబ్రెటీని చూసినా డిఫరెంట్ లుక్ హెయిర్ స్టైల్ ఉంటుంది. అలాంటి హెయిర్ స్టైల్స్ కొన్ని మీకోసం..

స్లీక్ లో పోనీటైల్

ఈ మధ్య దీపికా పదుకునే ఎక్కువగా వేసుకునే హెయిర్ స్టైల్.. స్లీప్ లో పోనీటైల్. ఇది ఒక రకమైన పోనీటైలే. కానీ చూడడానికి చాలా సింపుల్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తుంది. ఈ పోనీ టెయిల్ ఎలా వేస్తారంటే ఫ్లాట్ ఐరన్‌తో జుట్టును నునుపుగా చేస్తారు. ఆ తర్వాత హెయిర్ ని పాలిష్ చేస్తారు. మెడభాగంలో ఒక పోనీ వేసి.. రన్ వే రెడీ లుక్ కోసం షైన్ సిరంని ఉపయోగిస్తారు.

మెస్సీ బన్

కొన్ని హెయిర్ స్టైల్స్ గజిబిజీగా ఉంటేనే హైలెట్ అవుతాయి. ఇలాంటి హెయిర్ స్టైల్స్ లో మెస్సీ బన్ ఒకటి. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో కాజల్ చాలా ఫంక్షన్లలో ఈ హెయిర్ స్టైల్స్ తో కనిపించింది. పొడవాటి జుట్టువారికి ఇది అనువైన హెయిర్ స్టైల్. జుట్టును పైకి ముడివేసి, గజిబిజిగా వదిలేయాలి. అలాగే ముఖంపైన అటుఇటుగా ఉన్న జుట్టును కాస్త ముందుకు తీయాలి. అప్పుడు మీ హెయిర్ స్టైల్ రొమాంటిక్ గా కనిపిస్తుంది.

బ్రైడెడ్ క్రౌన్

ఒకప్పుడు యువరాణులు వేసుకునే అందమైన ఈ హెయిర్ స్టైల్‌ని ఇప్పుడు సెలబ్రెటీలు చాలా బాగా ఇష్టపడుతున్నారు. పార్టీలలో, ఫంక్షనలలో ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఈ హెయిర్ స్టైల్‌ని ఎలా వేయాలంటే జుట్టును చిక్కులు లేకుండ చేసి, మీ తల చుట్టూ ఒక వైపు నుండి జడ వేయాలి. అయితే ఈ జడ ఫ్రెంచ్ జడ లేదా డచ్ జడ అయి ఉండాలి. జడ పూర్తయిన తర్వాత దాన్ని మీ తల చుట్టూ కిరీటంలా చుట్టాలి. దీన్ని జడ పిన్నుల సాయంతో సెట్ చేయాలి. ఆ తర్వాత జడను మీకిష్టమొచ్చినట్లు సెట్ చేసుకోవచ్చు.

ఈ మూడు హెయిర్ స్టైల్స్ పొడవాటి జుట్టున్న ఏ ముఖానికైనా నప్పుతాయి. అలాగే ఒకవేళ ఈ హెయిర్ స్టైల్స్ వేసుకోవడం మీకు రాకపోతే ఏ ఎక్స్ పర్ట్ ని అయినా సంప్రదించండి. ఒకసారి మీరు చూసిన తర్వాత ఆ తర్వాత మీరే స్వయంగా ఇంట్లోనే వేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories