గబ్బిలాలే వారి గ్రామ దేవత!

గబ్బిలాలే వారి గ్రామ దేవత!
x
Highlights

గబ్బిలాలు ఎక్కువగా పాడు పడ్డ ఇళ్లలో.. చెట్ల గుబుర్త లో ఉంటాయి. అయితే నలుపు రంగులో ఉండే గబ్బిలాలు ఎక్కువగా చీకట్లోనే నివసిస్తుంటాయి. గబ్బిలాల నుండి...

గబ్బిలాలు ఎక్కువగా పాడు పడ్డ ఇళ్లలో.. చెట్ల గుబుర్త లో ఉంటాయి. అయితే నలుపు రంగులో ఉండే గబ్బిలాలు ఎక్కువగా చీకట్లోనే నివసిస్తుంటాయి. గబ్బిలాల నుండి దుర్వాసన వస్తుందని వాటి దగ్గరకు వెళ్లటానికి ఎవరు ఇష్టపడరు. కొంత మంది గబ్బిలాలు అంటే బయపడిపోతారు. ఎందుకంటే గబ్బిలాలు ఇంట్లోకి వస్తే ఆశుభాకరమైన వార్తలు వింటారని వారి అభిప్రాయం. అయితే గబ్బిలాలను పూజించే గ్రామం ఉంది. అవును ఇది నిజం.

చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలంలోని నడవలూరు గ్రామంలో గబ్బిలాల జాతికి చెందిన క్షీరదాలను గ్రామదేవతగా భావిస్తారు. కొన్ని వందల సంవత్సరాల నుండి వాటికి పూజలు చేస్తున్నారు. ఆ గ్రామంలోని చెరువు కట్టపై 11 చింతచెట్లలో ఈ గబ్బిలాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ చెట్ల మధ్యలోని ఒక చెట్టుకు చిన్నపాటి గుహలా ఉంటుంది. బరువు తక్కువ.. కాళ్లు, చేతులు సన్నగా.. రాత్రి సమయాల్లో కాళ్లు పెనవేసుకుని పడుకునే చిన్నారులకు పక్షిదోషం అని అక్కడ ప్రజలు భావిస్తారు. అలాంటి చిన్నారులను ఈ చెట్టు వద్ద స్నానం చేయించి.. పూజలు చేసి.. చెట్టు మొదలులోని తొర్రలో ఇటు వైపు నుంచి అటు.. అటు నుంచి ఇటు వైపునకు దాటిస్తుంటారు. తరువాత చిన్నారికి వేసిన డ్రస్స్‌ను ఆ చెట్టుకు కట్టడం ద్వారా దోషం పోతుందని వారి నమ్మకం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories