అభాగ్యుల సేవలో అభినవ కెరటం

Gangisetty Abhinay Extends Help to People in Need
x

అభాగ్యుల సేవలో అభినవ కెరటం

Highlights

Gangisetty Abhinay: గత రెండేళ్లుగా జన జీవనాన్ని పట్టి పీడిస్తున్న భూతం కరోనా.

Gangisetty Abhinay: గత రెండేళ్లుగా జన జీవనాన్ని పట్టి పీడిస్తున్న భూతం కరోనా. దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ అభాగ్యులు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ కొంతమంది మహానుభావాలు వారిని ఆదుకునే ప్రయత్నం చేశారు. వారిలో ఒకరు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దటూరుకు చెందిన గంగిశెట్టి అభినయ్‌.

కరోనా కాలంలో నిరుపేదలకి అన్నదానం చేశారు.. నగరానికి వచ్చిన వలసజీవులకి నిత్యావసర సరుకులని అందజేసి అండగా నిలిచారు. పలు స్వచ్చంధ సంస్థలతో కలిసి పేదప్రజలని ఆదుకున్నారు. ఇప్పుడు ఏకంగా తన తండ్రి పేరున గంగ్గిశెట్టి రమణయ్య ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదల పెన్నిధిగా నిలిచారు. అభాగ్యులకి అండగా నిలవడానికి తన వంతు పాత్ర పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories