వెయ్యి ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీ..ఈరోజు నుంచి ఏపీ అంతా అమలు!

వెయ్యి ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీ..ఈరోజు నుంచి ఏపీ అంతా అమలు!
x
Highlights

ఇప్పటివరకూ ఐదు జిల్లాల్లో అమలవుతున్న వెయ్యి ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి పథకం ఈరోజు నుంచి మిగిలిన జిల్లాల్లో కూడా అమలు కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంచనంగా పథకాన్ని ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ప్రజలకు మరో తీపి కబురు చెప్పింది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రకటించి..అమలు చేస్తున్న ప్రభుత్వం వాటిలో కొన్ని పథకాలను ప్రజలకు మరింత మేలు చేసే దిశగా నడిపే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ పథకంలో కీలక మార్పులు చేసింది జగన్ సర్కార్. ఈరోజు (10 నవంబర్) నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయి.

ఆరోగ్యశ్రీ లో ప్రభుత్వం కొత్తగా చేసిన మార్పు ఏమిటంటే.. ఆస్పత్రిలో రూ. వెయ్యి బిల్లు దాటితే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకివస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని ఏడూ జిల్లాల్లో ఈ పథకం అమలులో ఉండగా..మిగిలిన జిల్లాలకూ దీనిని విస్తరించారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు.


* ఆరోగ్య శ్రీలో ఇప్పటివరకు 2,200 వ్యాధులకు వర్తిస్తున్నాయి.. కొత్తగా మరో 234 వ్యాధులను చేర్చారు. దీంతో మొత్తం 2,434 వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాయి. * ఆస్పత్రి బిల్లు వెయ్యి రూపాయలు దాటితే బిల్లు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి జగన్ గత ఎన్నిక‌ల సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 3న పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. జూలై 16న నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈరోజు మిగిలిన జిల్లాల్లో ప్రారంభించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మేలు జరగనుంది.

* ఆరోగ్యశ్రీ కింద సంపూర్ణ క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా మరో 54 వైద్యప్రక్రియలను కూడా అందిస్తున్నారు. మొత్తంగా 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందించారు. కరోనా వైరస్‌ను కూడా ఆరోగ్యశ్రీలోకి చేరుస్తూ ఇటీవలే జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో కలిపి ఇప్పుడు మొత్తం 2,434 వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories