ఎమ్మెల్యే 36 గంటల ఉక్కుదీక్ష

Arun Chilukuri
Published on: 13 Feb 2019 1:57 PM IST
ఎమ్మెల్యే 36 గంటల ఉక్కుదీక్ష
X

బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలంటూ ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ దీక్షకు దిగారు. ఈ దీక్షా శిబిరాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. మహబూబాబాద్, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యకార్యకర్తలు హరిప్రియ దీక్షకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని నేతలు మండిపడ్డారు. వెంటనే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 13వ షెడ్యూల్‌లో పొందుపరిచిన విధంగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story