భారత పైలట్‌ను పాక్ విడుదల చేస్తుందా...జెనీవా ఒప్పందం ఏం చెబుతోంది..?

భారత పైలట్‌ను పాక్ విడుదల చేస్తుందా...జెనీవా ఒప్పందం ఏం చెబుతోంది..?
x
Highlights

పాక్ చెరలో ఉన్న భారత పైలట్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయా? మన పైలట్‌‌ను పాక్ విడుదల చేస్తుందా? కార్గిల్ యుద్ధంలో పట్టుబడిన యుద్ధ ఖైదీలను పాక్ ఏం చేసింది?...

పాక్ చెరలో ఉన్న భారత పైలట్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయా? మన పైలట్‌‌ను పాక్ విడుదల చేస్తుందా? కార్గిల్ యుద్ధంలో పట్టుబడిన యుద్ధ ఖైదీలను పాక్ ఏం చేసింది? జెనీవా ఒప్పందాన్ని పాక్‌ పాటిస్తుందా? అసలు జెనీవా ఒప్పందం ఏం చెబుతోంది?

యుద్ధంలో లేదా సరిహద్దులను దాటి పట్టుబడే సైనికులు, ప్రజలతో ఎలా వ్యవహరించాలనేది జెనీవా ఒప్పందం చెబుతుంది. జెనీవా ఒప్పందాన్ని 1929లో రూపొందించారు. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత 1949లో కొన్ని సవరణలు చేశారు. జెనీవా ఒప్పందంలో మొత్తం నాలుగు అంశాలు ఉన్నాయి. మానవ హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ఈ మార్గదర్శకాలను రూపొందించింది.

యుద్ధ ఖైదీల హక్కులను జెనీవా ఒప్పందంలో పొందుపరిచారు. 1949లో నాలుగు ప్రధాన సవరణలు చేశారు. మొదటి సవరణలో అనారోగ్యం లేదా గాయాలతో పట్టుబడే సైనికులను వారి రంగు, ప్రాంతం, మతం, లింగ బేధాలు, ధనం వంటి ఆధారాలతో వేధించకూడదు. అలాగే పట్టుబడిన సైనికులతో మానవత్వంతో వ్యవహరించాలి. వారిని హింసించడం లేదా ఉరి తీయడం చేయకూడదు. అదేవిధంగా గాయపడినా, అనారోగ్యంతో ఉన్నవారికి తక్షణం వైద్య సేవలు అందించాలి.

అలాగే నావికా, వైమానిక దళాలను కూడా జెనీవా ఒప్పందంలో చేర్చుతూ రెండో సవరణ చేశారు. ఇక మూడో సవరణ ప్రకారం పట్టుబడిన జవాన్ల ర్యాంకులు, సీరియల్ నెంబర్లు మాత్రమే తీసుకోవాలి. వారి దేశ రహస్యాలు తెలుసుకోడానికి హింసించకూడదు. అదేవిధంగా పట్టుబడిన జవాన్లకు లేదా యుద్ధ ఖైదీలకు రక్షణ కల్పించే బాధ్యత కూడా ఆ దేశానిదేనని నాలుగో సవరణలో స్పష్టం చేసింది. అంతేకాదు జవాన్లను యుద్ధ ఖైదీలుగా పట్టుకుంటే తిరిగి వారిని స్వదేశానికి అప్పగించాల్సి ఉంటుంది.

భారత వైమానిక దళ పైలెట్‌ అభినందన్ పాకిస్తాన్ ఆర్మీకి పట్టుబడిన నేపథ్యంలో... జెనీవా ఒప్పందం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అసలు జెనీవా ఒప్పందంలో ఏముందంటూ భారత్‌, పాక్ ప్రజలు గూగుల్‌లో వెతుకుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories