logo

ఎమ్మెల్యేను చంపిన మావోయిస్టులు హతం

ఎమ్మెల్యేను చంపిన మావోయిస్టులు హతం
Highlights

బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని హత్య చేసిన మావోయిస్టు కమాండర్‌ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్టు పోలీసులు తెలిపారు....

బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని హత్య చేసిన మావోయిస్టు కమాండర్‌ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్టు పోలీసులు తెలిపారు. ఏప్రిల్‌ 9న ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతరను పేల్చడంతో దంతెవాడ ఎమ్మెల్యే భీమా మాండవీతో పాటూ మరో నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం పోలీసులు పోలింగ్ నేపథ్యంలో జిల్లా రిజర్వు గార్డులు దంతెవాడలోని ధనికార్కా అడవుల్లో గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతాబలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. దీనిపై దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే మాండవీని చంపేసిన ఇద్దరు మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో హతమయ్యారని తెలిపారు. హతమైన మావోయిస్టులను వర్గీస్‌, లింగాగా పోలీసులు గుర్తించారు.

లైవ్ టీవి

Share it
Top