నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం..

నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం..
x
Highlights

కాలానికి అనుగుణంగా ఇప్పుడు ధూమపానం అనేది ఓ ఫ్యాషన్ లాగా మారిపోయింది .. అందులో యువత పైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.. పొగాకు అనేది మనం ఏ రూపంలో తీసుకున్నా...

కాలానికి అనుగుణంగా ఇప్పుడు ధూమపానం అనేది ఓ ఫ్యాషన్ లాగా మారిపోయింది .. అందులో యువత పైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.. పొగాకు అనేది మనం ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికమే . పొగాకు అనేది మన శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ ఫల్మనరీ డిసీజ్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు కేన్సర్‌ మరియు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పక్కవాళ్ళకి కూడా ప్రమాదమే... ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది.

ధూమపానం మానినట్లయితే!

జీవితం పై నమ్మకం పెరుగుతుంది. శరీరధార్ద్యత పెరుగుతుంది. వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అందం వికసిస్తుంది. కుటుంబ, సంసార సంబంధాలు ఇంకా బలపడ్డాయి. మానసిక చురుకుదనం ఉంటుంది. సొమ్ము ఆదా అవుతుంది. ధూమపానం మానిన

20 నిమిషాల్లోపే రక్తపోటు, గుండెకొట్టుకోవడం లాంటివి సాధారణ స్థితిలోకి వస్తాయి.

128 గంటల్లోపు రక్తంలోని ..లు స్థాయి సాధారణ స్థితికి వచ్చేస్తుంది.

24 గంటల్లో నికోటిన్ శరీరం నుంచి వైదొలుగుతుంది.

48 గంటల్లో వాసన, రుచి చూడటం వల్ల బాగా మెరుగౌతుంది.

78 గంటల్లో శ్వాసక్రియ బాగా అభివృద్ది చెందుతుంది.

78 గంటల్లో శ్వాసక్రియ బాగా అభివృద్ది చెందుతుంది.

9 నెలలలోపు దగ్గు 10% తగ్గిపోతుంది.

12 నెలలలోపు గుండె జబ్బుల ప్రమాదం 50% తగ్గిపోతుంది.

10 సంవత్సరాలలోపు ఊపిరితిత్తుల క్యాన్సర్ 50% తగ్గిపోతుంది.

మానేసిన వెంటనే చిరాకు, కోపం, మలబద్ధకం, మగత నిద్ర వంటి ఇబ్బందులు ఉంటాయి. కాని అవి తాత్కాలికమే అన్న విషయం మరువకూడదు. సిగరేట్ మానండి -కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి

Show Full Article
Print Article
Next Story
More Stories