Top
logo

స‌రికొత్త రూపు సంత‌రించుకున్న తెలంగాణ అసెంబ్లీ

Telangana AssemblyTelangana Assembly
Highlights

తెలంగాణ అసెంబ్లీ న‌యా లుక్ సంత‌రించుకుంది. ఈనెల 17నుంచి జ‌ర‌గ‌బోయే స‌మావేశాల‌కు అసెంబ్లీ ప్రాంగ‌ణం స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబ‌య్యింది. భ‌వ‌నాల‌కు రంగులు, ఎటుచూసినా ఆహ్లాదక‌రం అనిపించే ప‌చ్చ‌ద‌నం, స‌రికొత్త హైటెక్ హంగుల‌తో స‌భ్యుల‌కు ఘ‌నంగా ఆహ్వానం ప‌ల‌క‌బోతుంది.

తెలంగాణ అసెంబ్లీ న‌యా లుక్ సంత‌రించుకుంది. ఈనెల 17నుంచి జ‌ర‌గ‌బోయే స‌మావేశాల‌కు అసెంబ్లీ ప్రాంగ‌ణం స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబ‌య్యింది. భ‌వ‌నాల‌కు రంగులు, ఎటుచూసినా ఆహ్లాదక‌రం అనిపించే ప‌చ్చ‌ద‌నం, స‌రికొత్త హైటెక్ హంగుల‌తో స‌భ్యుల‌కు ఘ‌నంగా ఆహ్వానం ప‌ల‌క‌బోతుంది.

తెలంగాణలో రెండోసారి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు త‌ర్వాత ఈ నెల 17నుంచి 20 వ‌ర‌కు నాలుగు రోజుల పాటూ తొలి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అసెంబ్లీ భవనాన్ని సరికొత్తగా ముస్తాబు చేశారు. 18 ఏళ్ల త‌ర్వాత అసెంబ్లీ భ‌వ‌న స‌మూదాయాల‌కు పూర్తిస్థాయిలో రంగులు వేశారు. మిరిమిట్లు గొలిపే తెల్ల‌రంగు వేయ‌డంతో అసెంబ్లీ భ‌వ‌నం స‌రికొత్త శోభ‌ను సంత‌రించుకుంది. రాజ‌సం,హుందాత‌నం ఉట్టిప‌డేలా అసెంబ్లీ ప‌రిస‌రాలను తీర్చిదిద్దారు అధికారులు.

అసెంబ్లీ హాల్‌లో కొత్త గ్రీన్ కార్పెట్, భవనంలో డిస్పెన్సరీ, లైబ్రరీ, ఎలక్ట్రిక్, చిన్నచిన్న మరమ్మతు పనులు పూర్తిచేశారు. ప్రాంగ‌ణంలో స‌భ్యులు ప్ర‌వేశించే ద్వారం ద‌గ్గ‌ర కొత్త‌గా మినిపార్క్ ను సైతం ఏర్పాటు చేశారు. ఫుట్‌పాత్‌లకు కొత్తటైల్స్ వేయడంతోపాటు అహ్లాదకర వాతావరణం ఉండే విధంగా మొక్కలు నాటారు. టూ వీల‌ర్ పార్కింగ్ కోసం కాలిగా ఉన్న‌స్థ‌లంలోనూ పార్క్ ఏర్పాటు చెయ్య‌డంతో ఎటు చూసినా ప‌చ్చ‌ద‌నం క‌నిపిస్తోంది.

శాసనసభలో పార్టీల బలాబలాల‌ను బ‌ట్టి ఇచ్చే ఎల్పీ కార్యాల‌యాల‌కు సైతం అధికారులు రంగులు వేశారు. స‌రికొత్త నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. ఇక స‌భ్యులు మాట్లాడేందుకు వీలుగా ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ స‌రికొత్త శోభ‌ సంత‌రించుకుంది. తాత్కాలికంగా కాకుండా ప‌ర్మినెంట్ చైర్స్ ఏర్పాటు చేయ్య‌డంతో పాటూ ఆధునాత‌న రైలింగ్ సిస్ట‌మ్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీతోపాటు శాసనమండలి ప్రాంగణంలో సీఎంకు కొత్త చాంబర్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఆవరణంలోని పరిసరాలను చూడముచ్చటగా ముస్తాబు చేసారు. మొత్తానిక్ రెండోసారి బంపర్ మొజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గులాబీ పార్టీ అధినేత సూచనలతో తొలిస‌మావేశాల‌కు అసెంబ్లీ స‌మూదాయం న్యూ లుక్ సంత‌రించుకోంది.


Next Story

లైవ్ టీవి


Share it