కన్న తండ్రిని చంపి.. ఇంటి పక్కనే పూడ్చి..

కన్న తండ్రిని చంపి.. ఇంటి పక్కనే పూడ్చి..
x
Highlights

కన్న తండ్రి అని చూడకుండా అతి దారుణంగా చంపి శవాన్ని ఇంటి పక్కనే పూడ్చిపెట్టాడు కుమారుడు. విషయం అందరికి తెలియడంతో తాను పురుగుల మందు తాగి బలవన్మరణం...

కన్న తండ్రి అని చూడకుండా అతి దారుణంగా చంపి శవాన్ని ఇంటి పక్కనే పూడ్చిపెట్టాడు కుమారుడు. విషయం అందరికి తెలియడంతో తాను పురుగుల మందు తాగి బలవన్మరణం చేసుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలోని బర్మా కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. తన తండ్రి రోజు ఫుల్‌గా తాగి వచ్చి వేధిస్తున్నాడని తీవ్రకోపం పెంచుకున్న కుమారుడు తండ్రిని తల్లి సహయంతో చంపి..శవాన్ని ఇంటి పక్కనే పూడ్చిపెట్టాడు. ఫుల్‌గా తాగిన మైకంలో తండ్రిగోపిరెడ్డి ఈశ్వరరావు(55)ని తానే హతమార్చనని కుమార్ (21) తన చిన్నాన్నతో చెప్పాడు. ఈ ఘటన రెండునెలల తరువాత చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇక ఈ విషయం ఆ నోటా ఈనోటా పడి అందరికీ తెలియడంతో నిందితుడు కుమార్ తీవ్ర మనస్థాపంతో పురుగుల మందు తాగి బలవన్మరణనికి పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం కుమార్‌ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. గోపిరెడ్డి ఈశ్వర రావుకి నలుగురు అమ్మాయిలు కాగా, వారిలో ముగ్గురుకి వివాహం జరిగింది. అందరూ కుమార్తెలు కావడంతో, కుమార్‌ను దత్తత తీసుకుని పెంచుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories