logo

స్వరూపానందేంద్ర సరస్వతి వాఖ్యలపై సింగర్ సునీత ఫైర్ ...

స్వరూపానందేంద్ర సరస్వతి వాఖ్యలపై సింగర్ సునీత ఫైర్ ...
Highlights

సింగర్ సునీత పై ఎప్పుడు ఎదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది . అప్పట్లో ఆమె మరో పెళ్లి చేసుకోబోతుందని కధనాలు వచ్చాయి...

సింగర్ సునీత పై ఎప్పుడు ఎదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది . అప్పట్లో ఆమె మరో పెళ్లి చేసుకోబోతుందని కధనాలు వచ్చాయి . కానీ ఆమె వాటికీ స్పందించి అవి కేవలం రూమర్లు అని చెప్పేసింది . దీనితో అ మ్యాటర్ అక్కడికే ఆగిపోయింది . తాజాగా ఆమెను మరో వార్త చిక్కుల్లో పడేసింది .. అ వార్తలను కూడా ఆమె ఖండించారు ..

ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ... తన వద్దకు సినీ ప్రముఖులు వస్తుంటారని... చిరంజీవి, రజనీకాంత్ వచ్చారని, రాజేంద్రప్రసాద్ అబ్బాయి జగదీష్ వస్తుంటారు, సింగర్ సునీత కూడా వస్తుంటారని వ్యాఖ్యానించారు. తాను రాకున్నా తన పేరు చెప్పడంతో సునీతకు కోపం వచ్చింది. అయితే దీనిపైన సోషల్ మీడియా లో స్పందించారు సునీత ..

రోజు ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. కానీ అన్నింటిపై స్పందించాలని అనుకోము. కానీ కొన్ని విషయాలపై తప్పకుండా స్పందించాలి. స్వరూపానందేంద్ర సరస్వతి లాంటి ప్రముఖ వ్యక్తి తన వద్దకు వచ్చిన భక్తుల జాబితాలో నా పేరు చేర్చడం ఆశ్చర్యంగా ఉంది. అది కూడా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో... ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలనే ఈ పోస్టు పెడుతున్నాను, నేను అతడిని కలవక పోయినా ఎందుకు ఇలా చెబుతున్నారో తెలియదు' అంటూ సునీత వ్యాఖ్యానించారు.


లైవ్ టీవి

Share it
Top