ఏపీలోనూ టీడీపీకి బుద్ధిచెబుతారు: గోయల్

చంద్రబాబుకు తెలంగాణలో ఎదుర్కొన్న ఫలితాలే ఆంధ్రలో కూడా ఎదుర్కొంటారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీకి ప్రజలు ఇప్పటికే బుద్ధిచెప్పారని వ్యాఖ్యానించారు.

Arun Chilukuri
Published on: 7 Jan 2019 12:07 PM IST
Piyush Goyal
X
Piyush Goyal

చంద్రబాబుకు తెలంగాణలో ఎదుర్కొన్న ఫలితాలే ఆంధ్రలో కూడా ఎదుర్కొంటారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీకి ప్రజలు ఇప్పటికే బుద్ధిచెప్పారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టడాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఏపీలో కూడా దుష్ట కూటమికి చంద్రబాబు యోచిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలు కూడా తెలంగాణలో మాదిరిగానే బుద్ధిచెబుతారని చెప్పారు. తాను మీడియాతో మాట్లాడుతున్నప్పుడు తన వెనుక నుంచి టీడీపీ ఎంపీలు నినాదాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పియూష్‌ గోయెల్‌ ప్యాకేజీకి ఒప్పుకుని తర్వాత అసెంబ్లీలో తీర్మాణం చేశారని గుర్తు చేశారు. టీడీపీ ఎంపీలు డ్రామాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారన్న ఆయన రైల్వే జోన్‌ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story