నయన్ కి మద్దతు పలికిన మరొక హీరో

Ruthvik
Updated on: 27 March 2019 1:24 PM IST
నయన్ కి మద్దతు పలికిన మరొక హీరో
X

లేడీ సూపర్ స్టార్ నయనతారపై సీనియర్ నటుడు రాధారవి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామంది సెలెబ్రిటీలు రాధారవి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. డీఎంకే పార్టీ నుండి రాధారవిని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు స్టాలిన్. బాలీవుడ్ నటి, 'షకీలా' బయోపిక్ లో నటిస్తున్న రిచా చద్దా మాట్లాడుతూ, "మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారెవరినీ క్షమించకూడదు. అసభ్యకరమైన ప్రవర్తనకు, కించపరిచే మాటలకు ఆధునిక సమాజంలో చోటు లేదు" అంటూ చెప్పుకొచ్చారు. నటి ఖుష్బూ కూడా రాధా రవి వ్యాఖ్యలు చాలా దారుణమైనవి అని అన్నారు.

ఇక తమిళ నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడు, హీరో విశాల్ ఎట్టకేలకు ఈ నేపథ్యంలో మౌనం వీడారు. "ఆయన ఇలా మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడడం మొదటిసారి కాదు. ఒకవేళ ఆయనపై మనం కఠిన చర్య తీసుకోకపోతే, ఇది చివరిసారి కూడా కాదు" అని అన్నారు. రాధారవి కామెంట్లకు నవ్వుతూ చప్పట్లు కొట్టినవారి ప్రవర్తనను కూడా ఖండించాలని అభిప్రాయపడ్డాడు విశాల్. ఈ వివాదంపై సీనియర్ నటి రాధిక, రానా దగ్గుబాటి, సమంతా కూడా నయనతారకు మద్దతు పలికారు. రాధారవి మాటలని ఖండించారు.

Ruthvik

Ruthvik

Next Story