Top
logo

అందుకే మాయావతి కాళ్లు మొక్కా: పవన్‌ కల్యాణ్‌

అందుకే మాయావతి కాళ్లు మొక్కా: పవన్‌ కల్యాణ్‌
Highlights

ఏపీలో బీఎస్పీతో కలిసి జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాయావతి...

ఏపీలో బీఎస్పీతో కలిసి జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాయావతి వచ్చిన విషయం తెలిసిందే కాగా అక్కడి పవన్ కళ్యాణ్ మాయావతి కళ్లు మొక్కిన విషయం తెలిసిందే. అయితే మాయావతి కళ్లు ఎందుకు మొక్కాడో జనసేనాని వివరణ ఇచ్చారు. గల్లీ గల్లీకో గుండా ఉంటే ఉత్తరప్రదేశ్ లాంటీ రాష్ట్రంలో దళిత మహిళ అయిన మాయావతిని అక్కడి ప్రజలు సీఎంని చేశారని, అందుకే మాయావతి కాళ్లు మొక్కినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు. సోమవారం పవన్ కళ్యాణ్ తూ.గో జిల్లా అమలాపురం బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత తోట త్రిమూర్తులుపై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. త్రిమూర్తులను తాను ఎప్పుడూ పార్టీలోకి రమ్మని అడగలేదని స్పష్టం చేశారు.

కాగా గత 2014ఎన్నికల్లో మేము మద్దతు ఇస్తేనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. తోట త్రిమూర్తులు లాంటి వ్యక్తులను చెంచాలు అంటారు. తోట త్రిమూర్తులు జాతి గౌరవం కాపాడు. అసలు నేను నా అన్న చిరంజీవి మాటే వినను. అలాంటిది నీ మాట ఎలా వింటాను అని ప్రశ్నించాడు. టీడీపీ నాయకులు బానిసలకు బానిసలుగా బతులుకు బ్రతుకుతున్నారు. టీడీపీ, జనసేన ఒకటే అంటూ అవగాహన లేని మాటలు మాట్లాకండి అని పవన్ ధ్వజమెత్తారు.

Next Story