సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద కారు బీభత్సం

సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద కారు బీభత్సం
x
Highlights

సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓలా సంస్థకు చెందిన క్యాబ్ డ్రైవర్ పంజాగుట్టలోని సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర బారీకేడ్లను...

సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓలా సంస్థకు చెందిన క్యాబ్ డ్రైవర్ పంజాగుట్టలోని సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర బారీకేడ్లను ఢీకొట్టాడు. సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన బారికేడ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ కారును పక్కకు తొలగించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories