సుత్తి అంటే 'నేసమణే'

సుత్తి అంటే నేసమణే
x
Highlights

తెలుగు సినీ అభిమానులను సుత్తి అంటే ఏమిటంటే జంధ్యాల నాలుగు స్తంభాలాట సినిమాలోని సన్నివేశాన్ని చూపించేస్తారు. అదే విధంగా సుత్తి కి తమిళం లోనూ ఓ...

తెలుగు సినీ అభిమానులను సుత్తి అంటే ఏమిటంటే జంధ్యాల నాలుగు స్తంభాలాట సినిమాలోని సన్నివేశాన్ని చూపించేస్తారు. అదే విధంగా సుత్తి కి తమిళం లోనూ ఓ ఐకానిక్ సినిమా సన్నివేశం ఉంది. అది వడివేలు నటించిన ఫ్రెండ్స్ (ఈ సినిమా తెలుగులో స్నేహమంటే ఇదేరా పేరుతో రీమేకైంది). దీనిలో వడివేలు పాత్ర పేరే నేసమణి. ఇందులో ఓ సన్నివేశంలో వడివేలు తలపై సుత్తి పడటంతో అతను కళ్లు తిరిగి పడిపోయే ఫన్నీ సన్నివేశం ఉంటుంది. అది సూపర్ హిట్ సీన్ గా అప్పట్లో నిలిచింది.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కో సారి నెట్టింట్లో కొన్ని విషయాలు బాగా ట్రేండింగ్ గా మారిపోతాయి. ఇపుడు ఈ సన్నివేశం కార్టూన్ గా మారి #pray for nesamani టాగ్ తో ట్విట్టర్‌ ట్రెండ్స్ లో దూసుకుపోతోంది. ఎం జరిగిందంటే.. పాకిస్థాన్‌కు చెందిన కొందరు సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు సుత్తి ఫోటోను సోషల్ మీడియాలో చూస్తిస్తూ, 'ఈ పరికరాన్ని మీ దేశంలో ఏమంటారు? అని ప్రశ్నించారు. దీనికి హాస్య నటుడు వడివేలు అభిమానులు కొందరు ఈ ఫన్నీ సన్నివేశానికి సంబంధించిన ఒక కార్టూన్ ఫోటోను పోస్ట్ చేశారు. వడివేలు అభిమానులు పోస్ట్ చేసిన సన్నివేశాన్ని చూసిన కొందరు నెటిజన్లు వడివేలు నిజంగానే సుత్తి తగిలి పడిపోయాడనుకుని #pray for nesamani హ్యాష్‌ట్యాగ్‌ను ప్రారంభించారు. ఈ హ్యాష్‌ట్యాగ్‌పై వడివేలు అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే సమంత, సిద్దార్థ్, క్రికెటర్ హర్బజన్ సింగ్ స్పందించారు. దీంతో ఈ నేసమణి హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. అదండీ ఈ సరికొత్త సుత్తి సంగతి.

Show Full Article
Print Article
Next Story
More Stories