హైదరాబాద్ లో భారీగా పట్టుబడిన నగదు..

హైదరాబాద్ లో భారీగా పట్టుబడిన నగదు..
x
Highlights

ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 10లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా 3 కోట్ల 20 లక్షల రూపాయలు...

ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 10లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా 3 కోట్ల 20 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. కారులో నగదు తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. అనిల్ అగర్వాల్ అనే వ్యాపారికి చెందిన నగదుగా గుర్తించారు. అయితే ఒకేసారి భారీ మొత్తంలో నగదు తరలించడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనిల్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నగదు ఎక్కడి నుంచి తెచ్చారు. ఎవరికి చేరవేస్తున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నిన్న మాదాపూర్‌లో జయభేరి సంస్ధ ఉద్యోగుల నుంచి రెండు కోట్లు స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే మరోసారి భారీగా నగదు పట్టుబడటం తీవ్ర సంచలనంగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories